హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిన అక్రమ్‌ను అరెస్టు చేశారు.
పాకిస్తాన్‌కు స్పై చేస్తున్న మరో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ISIకి గూఢచర్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిన అక్రమ్‌ను బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ మూడేండ్ల నుంచి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్రమ్ వాట్సాప్ చెక్ చేయగా, నేరపూరిత సందేశాలను గుర్తించామన్నారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. త్వరలోనే అక్రమ్ గూఢచర్యానికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.
హర్యానాలోని పల్వల్ ప్రాంతానికి చెందిన ‘జ్యోతి మల్హోత్రా’ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ట్రావెల్ వ్లాగర్ ముసుగులో జ్యోతి, దేశంలోని సున్నితమైన సమాచారాన్ని, ముఖ్యంగా సైనిక స్థావరాలు, కదలికలకు సంబంధించిన వివరాలను పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లకు చేరవేసినట్లు విచారణలో తేలింది. జ్యోతి మల్హోత్రా, ఆమెతో పాటు అరెస్టైన మరో ఐదుగురు నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పాక్ ఏజెంట్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం చేరవేసినందుకు గాను వారికి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో జ్యోతి మల్హోత్రా 2023లో ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించినట్లు వెల్లడైంది. ఆ పర్యటనలోనే ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేసే ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుందని, ఆ తర్వాతే గూఢచర్య కార్యకలాపాలు ప్రారంభించినట్లు అనుమానిస్తున్నారు. కాగా, డానిష్‌ను గూఢచర్యం ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇప్పటికే దేశం నుంచి బహిష్కరించింది.
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!