July 3, 2024
SGSTV NEWS
Assembly-Elections 2024

దెందులూరు వైసిపికి మరో షాక్ – ఉదయించిన ఆశలు సూర్యాస్తమయం లోపే అడి ఆశలు*

గురువారం ఉదయం టిడిపి నుంచి వైసిపి లోకి వెళ్ళిన వార్డు మెంబర్ బాలిన శివ ఇంకా సూర్యాస్తమయం కూడా కాకుండానే తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిక*

– *టిడిపిలోకి ఇన్-కమింగ్ యే తప్ప అవుట్ గోయింగ్ లేదన్న చింతమనేని ప్రభాకర్ – వ్యక్తిగత స్వార్థ పరులే పార్టీని వీడి పోయారని, అలాంటి వాళ్ల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పిన చింతమనేని ప్రభాకర్*
—–
పెదవేగి, ఏప్రిల్11: దెందులూరు వైసిపికి ఎన్నికల వేళ భారీ షాక్ లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వైసిపి పార్టీని వీడి ఇటీవల కొన్ని వందల మంది చింతమనేని ప్రభాకర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దెందులూరు వైసిపి నాయకులు తాజాగా గురువారం ఉదయం పెదవేగి మండలం లక్ష్మిపురం పంచాయితీ MRC కాలనీకి చెందిన టిడిపి వార్డు మెంబర్ బాలిన శివ వైసిపి లో చేరటంతో ఎంతో ఉపశమనం పొందారు. టిడిపి వార్డు మెంబర్ వైసిపిలోకి చేరారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి ఆనందించారు. అయితే ఆ ఆనందం వారికి కొన్ని గంటలు కూడా నిలబడనివ్వకుండానే వైసీపీలో చేరిన వార్డు మెంబర్ శివ ఆ పార్టీలో ఇమడలేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు.
దుగ్గిరాలలో జరిగిన ఓ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ నీ కలిసి వైసిపి నాయకులు వత్తిడితో అయిష్టంగానే ఈరోజు ఉదయం పార్టీని వీడానని, తనకు వైసిపిలోకి వెళ్ళటం ఏ మాత్రం ఇష్టం లేదని, సొంత పార్టీ నాయకులకే అక్కడ విలువ లేదని, అందుకే తిరిగి టిడిపిలో చేరాలని స్వచ్ఛందంగా వచ్చినట్లు బాలిన శివ తెలిపారు. అదేవిధంగా గార్లమడుగుకి చెందిన మేడికొండ సురేష్ కూడా ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా తిరిగి ఆహ్వానించారు..
ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “వైసిపి పార్టీలో సొంత పార్టీ నాయకులకే విలువ గౌరవం లేక ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, టిడిపిని వీడి వైసిపిలో చేరిన బాలిన శివ ఒక్క రోజు కాదు కదా, ఒక్క పూట కూడా అక్కడ ఉండలేక తిరిగి టిడిపిలో చేరారంటే వైసిపి పార్టీ దుస్తితి అందరికీ అర్థం అవుతుందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. స్వార్థ రాజకీయాలు చేయాలనుకున్న వారు, వ్యక్తిగత స్వార్థం కోసమే వచ్చిన వారు టిడిపిని వీడి పోయారని, అలాంటి వాళ్ల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రాబోయేది టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వమే అని,దెందులూరులో కూటమి విజయం తధ్యం అని, వైసిపి నాయకులు ఎలాంటి జిమ్మిక్కులు చేసినా ఈ సారి దెందులూరులో భారీ మెజార్టీతో గెలుపు తమదే అని చింతమనేని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా వైసిపి నాయకులు తమ తీరు మార్చుకుని హుందాగా రాజకీయాలు చేయాలని చింతమనేని ప్రభాకర్ హితవు పలికారు.”

ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇంచార్జీ కొనకళ్ల శివమణి గౌడ్,  టిడిపి నాయకులు మేకా కనకరాజు, పామర్తి నాగభూషణం, అన్నపననేని సురేష్, పరసా శ్రీనివాస రావు తదితులు పాల్గొన్నారు…
———-
మీడియా కోఅర్డినేషన్ విభాగం,
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం,
దుగ్గిరాల.

Also read

Related posts

Share via