ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను చంపేందుకు కూడా భార్యలు వెనుకడాటం లేదు. సమాజంలో ఇలాంటి తరహా ఘటనలే ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతునులిమి చంపేసిందో భార్య
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను చంపేందుకు కూడా భార్యలు వెనుకడాటం లేదు. సమాజంలో ఇలాంటి తరహా ఘటనలే ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతునులిమి చంపేసిందో భార్య. నారయణపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు.
ప్రియుడితో నిత్యం ఫోన్ లో
అయితే అక్కడ పనిచేసే ఓ యువకుడితో రాధకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబధానికి దారి తీసింది. దీంతో ఈ విషయం రాధ భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. అంతేకాకుండా అక్కడినుంచి భార్యను తీసుకుని హైదరాబాద్ కు షిప్ట్ అయ్యాడు. అయినప్పటికీ రాధలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రియుడితో నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇది గమనించిన అంజిలప్ప భార్యను మరోమారు మందలించాడు. ఇదే విషయంలో పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.
ఈ క్రమంలోనే 2025 జూన్ 23న రాత్రి అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాగిన మైకంలో భర్త పడుకొని ఉండగా భార్య గొంతు నులిమి హత్య చేసింది. తెల్లవారుజామున లేచి గుడిసెలోకి వెళ్లి భర్త చనిపోయాడని రోదిస్తూ మృతదేహాన్ని అంబులెన్స్‌లో కోటకొండకు తీసుకొచ్చింది. అయితే అంజిలప్ప మృతిపై అతని సోదరుడు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!