April 19, 2025
SGSTV NEWS
CrimeNational

బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్


రాజస్థాన్‌లోని ఓ బాబా తన వద్దకు వచ్చిన మహిళకు మత్తు పదార్థం కలిపిన ప్రసాదం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరింత సమాచారం ఈ స్టోరీ చదవండి.

మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేవుని పేరుతో బాబాలు కూడా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని ఓ బాబా కూడా మహిళకు మత్తుపదార్థం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చెప్పిన వివరాల ప్రకారం.. సికర్ జిల్లా దటుంజర్‌లోని క్షేత్రపాల్ అనే ఆలయంలో ఉంటున్న బాబా బాలాక్‌నాథ్‌కు రాజేష్ అనే వ్యక్తి ఆ మహిళను పరిచయం చేశాడు. 

ఆ బాబా ఆమె ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలను తంత్ర విద్య ద్వారా పరిష్కరిస్తానని చెప్పాడు. ఆ మహిళతో మాట్లాడే సందర్భంలో పలుమార్లు ఆ బాబా ప్రసాదం ఇస్తుండేవాడు. అయితే ఒకరోజు బాబా ఆమెను తన ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. అదే సమయంలో ఆమెకు ఓ స్వీట్‌ను ఇచ్చాడు. అది తీసుకున్న ఆ మహిళ కొద్దిసేపటికీ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆ బాబా తనను పలుమార్లు రేప్ చేశాడని ఆ మహిళ ఎఫ్‌ఐఆర్‌ చెప్పింది. ఈ సమయంలో బాబా డ్రైవర్ యోగేశ్ ఈ వీడియోను రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ ఘటన జరిగిన తర్వాత ఆ బాబా తనను వేధించడం మొదలుపెట్టాడని ఆ మహిళ చెప్పారు. అలాగే తమల్ని రెగ్యులర్‌గా కలవాలండూ ఆ బాబా, అతని సహచరులు డిమాండ్ చేశాడని తెలిపారు. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియో రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు చెప్పారు. అలా కొన్నినెలల పాటు తనను చిత్రహింసలు పెట్టాడని ఆ మహిళ ఎఫ్‌ఐఆర్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితుడిని ప్రశ్నిస్తూ ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

Also read

Related posts

Share via