బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. అన్నా యూనివర్శిటీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసును నిర్వహించడంలో పోలీసులు, ప్రభుత్వ తీరును ఖండించారు. దీంతో కోయంబత్తూరులోని తన నివాసం బయట ఆయన స్వయంగా కొరడా ఝుళిపించారు.
తమిళనాడులో దారుణం జరిగింది. అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆ యువత ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ విషయం పోలీసులకు చెప్తే సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది.
దీనిపై తాజాగా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై స్పందించారు. అన్నా యూనివర్శిటీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసును నిర్వహించడంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. వారి కేర్‌లెస్‌ను ఖండిస్తూ కోయంబత్తూరులోని తన నివాసం బయట అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అసలు ఏమైందంటే?
చెన్నై నడిబొడ్డున ఉన్న అన్నా యూనివర్సిటీలో ఓ యువతి పై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 23న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు.. ఆ అమ్మాయి స్నేహితుడిని గాయపరిచి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఆ తర్వాత ఆ యువతిని అసభ్యకరంగా ఫొటోలు తీసి.. తమపై ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ బాధితురాలు ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని చెన్నై కోట్టూరుపురానికి చెందిన జ్ఞానశేఖరన్ గా గుర్తించారు. జ్ఞానశేఖరన్ రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునేవాడని సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!