• ఏడాది క్రితం చనిపోయిన తల్లిదండ్రులు
• ప్రస్తుతం అన్న మృతితో ఒంటరైన 11 ఏళ్ల బాలిక
ఇల్లంతకుంట(మానకొండూర్): ఏడాది క్రితం తండ్రి గుండెపోటుతో.. తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై తోడునీడగా ఉన్న అన్న మృతితో 11 ఏళ్ల బాలిక ఒంటరైంది. ‘అన్నా నాకిక దిక్కెవరూ’ అని ఏడుస్తూ అన్న మృతదేహానికి తలకొరివి పెట్టడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు..
ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన నాయిని రాజేశం- దేవవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు వందన, సంజన, కొడుకు వంశీ (25) సంతానం. ఉపాధి కోసం రాజేశం దుబాయ్ వెళ్లేవాడు. ఉన్నంతలో పెద్ద కూతురు వందనకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఏడాది క్రితం రాజేశం దుబాయ్ గుండెపోటుతో చనిపోయాడు. మృతిచెందింది. అప్పటికే దేవవ్వ కేన్సర్ బారినపడి
ఆమె దహనసంస్కారాలు జరిగిన మూడు రోజులకే దుబాయ్ నుంచి రాజేశం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతడి అంత్యక్రియలను కొడుకు నిర్వహించాడు. అప్పటి నుంచి సంజన ఆలనపాలనను వంశీ చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయి ఏడాది అవుతుండగా, మంగళవారం వంశీ సైతం కిడ్నీలు పాడయి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సంజన ఒంటరయింది. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. చిన్న వయస్సులో అన్నకు తలకొరివి పెట్టడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!