హిందూపురం నియోజకవర్గంలో నోట్ల సంచులు కలకలం రేపాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం పిల్లిగుండ్ల కాలనీలో కరెన్సీ నోట్ల సంచులు కలకలం రేపాయి. కర్ణాటక సరిహద్దులోని పిల్లిగుండ్ల కాలనీలో నాలుగు డబ్బు సంచుల్లో రెండు సంచులు ఓ ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో విసిరేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. ఓమహిళ తన ఇంటి దగ్గర పడిపోయిన సంచులను తీసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత డబ్బులు పడేసిన వారు వచ్చి చూడగా సంచులు లేకపోవడంతో స్థానికులను విచారించారు. చివరకు ఇద్దరు మహిళలు ఆ డబ్బును తీసి వేరే చోట పెట్టినట్లు తెలుసుకున్నారు. డబ్బు సంచులు వదిలేసిన ప్రాంతంలో ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి ఆరా తీశారు గుర్తు తెలియని వ్యక్తులు. పారేసిన డబ్బుల సంచుల్లో నగదు తక్కువగా ఉందని గమనించి.. ఆమె ఇంట్లో ఉన్న డబ్బు కట్టలు తిరిగి తీసుకొని పారిపోయారు.
ఈవిషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు వెంటనే పిల్లిగుండ్ల కాలనీలో పర్యటించారు. కాలనీవాసులను, ఆ మహిళను విచారించారు. పోలీసులు విచారణలో డబ్బు తీసుకెళ్లి వారిలో కొందరిపేర్లను చెప్పింది మహిళ. పార్టీలకుచెందిన డబ్బులు తరలిస్తుండగా పోలీస్ సైరన్ విని నోట్ల కట్టల సంచులు అక్కడ వదిలేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు సంచుల్లో నుంచి సుమారు 50లక్షలు వరకూ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఈడబ్బును కాలనీలో డబ్బులు పంచేందుకు తీసుకొచ్చారా? అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు అధికారులు. ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు
ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని