November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అరడజను సంబంధాలు చూశాడు.. కానీ పెళ్లికాలేదు.. పాపం చివరకు

అరుడజను పెళ్లి సంబంధాలు చూసాడు. అబ్బాయికి అమ్మాయిలు నచ్చుతున్నారు.. కానీ అమ్మాయిలకే అతడు నచ్చడం లేదు. ఇంకెన్ని పెళ్లి సంబంధాలు చూసినా.. ఇక తనకు పెళ్లి కాదని నిశ్చయించుకున్నాడు. ఎన్నాళ్ళున్న పెళ్లి కావడం లేదన్న తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీలోని వెంకటరెడ్డి పల్లికి చెందిన లక్ష్మీనారాయణ అనే యువకుడు ఇంటిపై కప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అబ్బాయికి అమ్మాయిలు నచ్చుతున్నారు.. కానీ అమ్మాయిలకే అతడు నచ్చడం లేదు. ఇంకెన్ని పెళ్లి సంబంధాలు చూసినా.. ఇక తనకు పెళ్లి కాదని నిశ్చయించుకున్నాడు. ఎన్నాళ్ళున్న పెళ్లి కావడం లేదన్న తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీలోని వెంకటరెడ్డి పల్లికి చెందిన లక్ష్మీనారాయణ అనే యువకుడు ఇంటిపై కప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీనారాయణకు చిన్నప్పటినుంచి నత్తి ఉండడంతో.. ఎన్ని పెళ్లి సంబంధాలకు వెళ్లినా పిల్లనిచ్చేందుకు నిరాకరించారు.

Also read :కావలి పోలీసుల ప్రత్యేక కృషితో.. అంతరాష్ట్ర బైక్ దొంగలు అరెస్ట్!

దీంతో తీవ్ర మనస్థాపం చెందాడు ఆ యువకుడు. నత్తితో ఇబ్బంది పడుతున్న లక్ష్మీనారాయణ ఇక తనకు ఎప్పటికీ పెళ్లి జరగదని కృంగిపోయాడు. తీవ్ర మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి తిమ్మక్క విగత జీవిగా పడిఉన్న కొడుకు లక్ష్మీనారాయణను చూసి కన్నీరు మున్నీరైంది. నత్తితో ఇబ్బంది పడుతున్న కొడుకు లక్ష్మీనారాయణ కొద్దిరోజులుగా వివాహం జరగడం లేదని బాధపడుతున్నట్లు తల్లి తిమ్మక్క పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే తనకు ఎన్నాళ్ళు ఉన్న పెళ్లి జరగడం లేదని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి చెబుతుంది.

Also read :దారుణం: టీ పెట్టలేదని కోడల్ని ఉరేసి చంపిన అత్త!

దారుణం: టీ పెట్టలేదని కోడల్ని ఉరేసి చంపిన అత్త!

కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య..

Related posts

Share via