April 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

గణేష్‌ మండపంలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. క్షణాల్లో మృతి

వినాయక చవితి పండగ సందర్భంగా పలు చోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి డ్యాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. గంగమ్మ ఆలయానికి సమీపంలోని మండపంలో అశోక్‌ (32) అలియాస్‌ లోబో అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న..


ఆళ్లగడ్డ, సెప్టెంబర్‌ 10: వినాయక చవితి పండగ సందర్భంగా పలు చోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి డ్యాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. గంగమ్మ ఆలయానికి సమీపంలోని మండపంలో అశోక్‌ (32) అలియాస్‌ లోబో అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అశోక్‌ పెయింటర్‌గా పనిచేసేవాడు. విచిత్ర వేషధారణ, కేశాలంకరణలతో వేడుకల్లో నృత్యం చేస్తూ అలరిస్తూ ఉండేవాడు. కాగా అశోక్‌కు భార్య ఉంది. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. భర్త అకాల మరణంతో మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.

తాజా వార్తలు చదవండి

Also read

Related posts

Share via