December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఎంత పనిచేశావ్‌రా..! ఒప్పుకోలేదని మహిళ ప్రాణం తీశాడు.. అనాథలైన ఇద్దరు చిన్నారులు..



ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని రజకవీధిలో ఇలాంటి పరిస్థితుల్లోనే దారుణం జరిగింది. కొన్నాళ్ళు సహజీవనం చేసి అది నచ్చక దూరంగా ఉంటున్న ఓ వివాహిత మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది.


మహిళ ఒకసారి ”నో” చెప్పిందంటే.. ముమ్మాటికీ వద్దనే అర్ధం… అది సంసారమైనా, వివాహేతర సంబంధమైనా, వ్యాపార లావాదేవీలైనా ఒకటే.. ఈ విషయాన్ని సినీ హీరో పవన్ కళ్యాణ్‌ తన ”వకీల్‌సాబ్”, అల్లు అర్జున్‌ ”అల వైకుంఠపురంలో” సినిమా మాధ్యమాల ద్వారా బలంగా చెప్పారు. ఇదే విషయాన్ని పెద్దలు, సంఘ సంస్కర్తలు కూడా ఎన్నో మార్లు చెప్పారు.. అయినా.. ఎవరికీ చెవికి ఎక్కడం లేదు.. మహిళల మనోభావాలు, ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా శారీరక సుఖమే లక్ష్యంగా మృగంలా మారిన మగాళ్ళు ఆమెపై దాడికి తెగబడుతూనే ఉన్నారు. తమ అహంపై దెబ్బకొట్టారన్న కక్షతో వారి అంతు చూస్తున్నారు. ఫలితం మహిళు ప్రాణాలు పొగొట్టుకుంటుంటే.. మృగంలా ప్రవర్తిస్తున్న కామాంధులు కటకటాలపాలవుతున్నాడు… ప్రాంతం ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా మగువ మనుగడకు ముప్పు తప్పడం లేదు..

ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని రజకవీధిలో ఇలాంటి పరిస్థితుల్లోనే దారుణం జరిగింది. కొన్నాళ్ళు సహజీవనం చేసి అది నచ్చక దూరంగా ఉంటున్న ఓ వివాహిత మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. మృతురాలి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో తన ఇద్దరు బిడ్డలతో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఆమె, ఓ యువకుడి మాటలు నమ్మి సహజీవనం చేసింది. అయితే ఆ యువకుడి పోకడలు నచ్చక ఆమె దూరంగా ఉండటంతో కక్ష కట్టి హత్య చేశాడో ఉన్మాది. మృతురాలికి 6 ఏళ్ళ పాప, 5 ఏళ్ళ బాబు ఉన్నారు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి హత్యకు గురికావడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రకాశంజిల్లా గిద్దలూరులోని రజకవీధిలో వివాహిత మహిళ సుహాసిని (24) దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా రాచర్లకు చెందిన సుహాసిని (24) అనే వివాహిత మహిళ తన భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ఇద్దరు బిడ్డలతో ఒంటరిగా జీవిస్తోంది. భర్త మరణానంతరం సుహాసిని గిద్దలూరు వచ్చి ఓ రెడీమేడ్‌ దుస్తుల దుకాణంలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె స్వగ్రామం రాచర్లకే చెందిన నానీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ళు వీరిద్దరూ సహజీవనం చేశారు. అయితే నానీ పోకడలు నచ్చక ఇటీవల సుహాసిని అతడిని దూరం పెట్టింది. తనతో సహజీవనం చేయడం లేదన్న కక్షను పెంచుకున్న నాని, సుహాసినిని హతమార్చాలని కుట్ర పన్నాడు.


రెండు రోజల క్రితం గిద్దలూరులో ఉంటున్న సుహాసిని దగ్గరకు వచ్చాడు. సుహాసినితో మాట్లాడుతూనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. కత్తితో ఆమె ఛాతీలో పొడిచాడు. తీవ్రగాయంతో సుహాసిని కేకలు వేయడంతో నానీ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే స్థానికులు ఆమెను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుహాసిని మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read

Related posts

Share via