వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.. వాళ్లకి ఇద్దరు పిల్లలు.. ముద్దులొలికే ఇద్దరు ఆడపిల్లలను చూసుకొని దంపతులిద్దరూ మురిసిపోయేవారు. ఏనాడూ వాళ్లకు ఏ కష్టం రానివ్వలేదు. ఏమైందో ఏమో కానీ.. ఆ తల్లి తనువు చాలించాలనుకుంది. తను చనిపోతే ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటని అనుకుందో ఏమోగానీ.. వాళ్ళిద్దరికీ విషం ఇచ్చి తాను తాగింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
విశాఖ తగరపువలసలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లలకు పురుగుల మందు తాగించి.. తనూ తాగింది తల్లి. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురుని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మాధవి, రెండేళ్ల రితీక్ష మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఐదేళ్ల ఇషిత చికిత్స పొందుతుంది. భర్తతో మనస్పర్ధలే కారణంగా భావిస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన బాణాల గణపతిరావుకు ఇద్దరు కూతుర్లు. రామకృష్ణ అనే వ్యక్తితో 2019లో వివాహం చేశారు. మాధవి రామకృష్ణ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఐదేళ్ల ఇషిత, పద్దెనిమిది నెలల రితీక్ష ఉన్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
తండ్రికి కాల్ చేసి
నిన్న తండ్రితో ఫోన్లో మాట్లాడుతోంది మాధవి. కాసేపటికి కళ్ళు తిరిగినట్టు చెప్పింది. వెంటనే ఫోన్ పక్కన పడేసింది. దీంతో అనుమానం వచ్చిన తండ్రి.. స్థానికంగా ఉన్న కొంతమందికి ఎలర్ట్ చేశారు శ్రీకాకుళంలో ఉంటున్న తండ్రి. ఇరుగు పొరుగు వచ్చి చూసేసరికి తల్లి, పిల్లలు ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి, కూతురు రితిక్ష ప్రాణాలు కోల్పోయారు. భర్తతో జరిగిన స్వల్ప వివాదమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లి కూతురు మృతితో స్థానికంగా తీవ్ర విషాదం అలముకుంది.
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..