July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఓ కాలనీలో పార్క్‌ చేసిన బస్సు.. 3 రోజులైనా అక్కడే.. లోపలున్నవి చూసి ఆశ్చర్యపోయిన జనం!

విశాఖలో ఇటీవల భారీగా డ్రగ్స్‌ దొరకడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. డ్రగ్స్‌ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఆ పరిశ్రమలో CBI అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో మూడు రోజులుగా సంధ్య ఆక్వా బస్సు ఉండటం కలకలం రేపింది..బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు..ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్కులు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

అయితే ప్రధానంగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్‌బుక్కులు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..సీబీఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ రికార్డులు పరిశ్రమ నుంచి బయటికొచ్చినట్లు సమాచారం. మరోవైపు సోదాలు జరిగితే రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో డ్రగ్స్‌కు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్‌ కంటెయినర్‌ను సీబీఐ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత.. మూలపేటలో ఉన్న పరిశ్రమలో తనిఖీలకు రెండు రోజులు తనిఖీలు జరిగాయి. సంధ్య ఆక్వా బస్సు ఇలా అనుమానాస్పదంగా కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో బస్సులో డాక్యుమెంట్లు, ఫైళ్లు, రికార్డులను ఆ అధికారులకు అప్పగించాల్సింది పోయి, కంపెనీ ప్రతినిధులకు అందజేశామనడంపై చర్చనీయాంశమైంది

Also read

Related posts

Share via