December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: శభాష్ భీమా ..! రైలెక్కడానికి వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు.. రైల్వే స్టేషన్లో కలకలం..!



విశాఖ రైల్వే స్టేషన్.. వచ్చే పోయే ప్రయాణికులతో బిజీబిజీగా ఉంది… రైళ్లు కూడా ఫ్లాట్‌ఫామ్‌పై వస్తూ వెళ్తూ ఉన్నాయి.. ఇక జిఆర్పి పోలీసులు తమ రోజువారి విధుల్లో నిమగ్నమై ఉన్నారు.. రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు.. ఇంతలో పోలీస్ జాగిలం ఒక్కసారిగా ఒకచోట ఆగిపోయింది.. అనుమానితుడిని పట్టుకున్నారు.. చెక్ చేస్తే..


విశాఖ రైల్వే స్టేషన్‌లో గవర్నమెంట్ రైల్వే పోలీసులకు నార్కోటిక్ డాగ్స్ భలే సహకారం అందిస్తున్నాయి. తనిఖీలు చేస్తూ నిందితులను పట్టిస్తున్నాయి. తాజాగా భీమా అనే స్నిఫర్ డాగ్.. గంజాయి స్మగ్లర్ ఆట కట్టించింది.

జిఆర్పి సీఐ ధనుంజయ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖ రైల్వే స్టేషన్లో జిఆర్పి పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. వెళ్తూ.. వెళ్తూ.. ఆ పోలీసు జాగిలం భీమా ఒక్కసారిగా ఆగింది. ఎందుకు ఆగిందని అనుమానం వచ్చింది పోలీసులకు.. ఎంతగా రమ్మన్నా ఆ జాగిలం అక్కడ నుంచి కదలడం లేదు. దీంతో పోలీసులు అక్కడ చెక్ చేశారు.. ఇంకేముంది గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ జరిగిపోతోంది. డాగ్ చాకచక్యంతో ఆ గుట్టు బయటపడింది. 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌కు చెందిన దానిష్ అనే నిందితుడని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షా అరవై వేలు. తనిఖీలు చేపట్టి గంజాయి గుర్తించిన నార్కో టిక్ స్నిఫర్ డాగ్ భీమాను.. డాగ్ హ్యాండ్లర్‌ను అభినందించారు అధికారులు.

ఈ మధ్యకాలంలో సీజర్ అనే మరో జాగీలం రైల్వేస్టేషన్లో గంజాయిని రెండుసార్లు పట్టుకుంది. ఏకంగా హోం మంత్రితోనే ప్రశంసలు కూడా అందుకుంది సీజర్. ఇప్పుడు భీమా తన పనిని ప్రారంభించేసింది. రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే గంజాయి ముఠాల ఆట పట్టించేందుకు సీజర్, బీమా ఏదో కళ్ళతో కాపు కాస్తున్నాయి. గంజాయితో వచ్చారో అంతే సంగతులు మరి…!

Also Read

Related posts

Share via