పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడో వ్యక్తి. చెల్లుబోయిన లోచన కుమార్ అనే యువకుడు.. నకిలీ డీఎస్పీ వేషంలో ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం.. విశాఖ నగరంలో సంచలనం సృష్టిస్తోంది.
విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో(Police Department) ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల నుంచి చెల్లుబోయిన లోచన కుమార్(Lochana Kumar) అనే వ్యక్తి నకిలీ డీఎస్పీ వేషంలో లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం.. విశాఖ నగరంలో సంచలనం సృష్టిస్తోంది. 2019 నుంచి 2026 వరకు తాను డీఎస్పీ, ఎస్పీ అని చెబుతూ పలు మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విశాఖ పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు డీటీసీ(డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్)లో గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్లిన నకిలీ డీఎస్పీ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు
ఫేక్ ప్రచారాలు..
నెల్లూరులో దొరికిన నకిలీ డీఎస్పీని విశాఖపట్నానికి తీసుకువచ్చారు పోలీసులు. గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్లు లోచన కుమార్ పలు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు చేశాడు. అతడిపై విశాఖ సిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ పీఎస్‌లో రెండు కేసులు, ఎంవీపీ పీఎస్, మల్కాపురం పీఎస్, ఫోర్త్ టౌన్ పీఎస్‌లలో చీటింగ్, ఎక్స్టార్షన్, జాబ్ ఫ్రాడ్ వంటి కేసులపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. సివిక్ సెంటర్ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో బిల్డప్ ప్రచారాలకు దిగాడు. లోచన కుమార్ మోసాలపై విశాఖపట్నం పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల ప్రత్యేక దర్యాప్తు..
నకిలీ డీఎస్పీ లోచన కుమార్ మోసాలపై విశాఖపట్నం నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇతనికి సహకరించిన వ్యక్తులు ఇంక ఎవరైనా ఉన్నారా? నగదు లావాదేవీలు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లాయి.? ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా.? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
అభ్యర్థులకు పోలీసుల సూచనలు..
ఈ కేసు నేపథ్యంలో పోలీసులు అభ్యర్థులకు ముఖ్య సూచనలు చేస్తున్నారు. పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎవరు డబ్బులు అడిగినా వెంటనే అప్రమత్తంగా ఉండాలని, అధికారిక నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియల ద్వారానే ఉద్యోగాలు వస్తాయని పోలీసులు గుర్తు చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి డబ్బులడిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
Also read
- కడపలో మహిళా హెచ్ఎం ఆత్మహత్యాయత్నం
- ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..
- Telangana: ఛీ.. ఛీ నువ్వేం టీచర్‌రా.. చదువు చెప్పడం మాని స్కూల్లో ఆవేం పనులు..
- పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో లక్షల్లో కుచ్చుటోపీ
- సోఫాకు సిగరెట్ నిప్పంటుకుని..





