SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: అనకాపల్లి మైనర్‌ బాలిక హత్య కేసు.. పోలీసుల ముమ్మర దర్యాప్తు.. ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమానం

బాలికను హత్య చేసిన నిందితుడు సురేష్.. ఆ తరువాత రక్తపు మరకలు అంటుకున్న డ్రస్‌ను మార్చుకుని పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి ముందు నిందితుడు ధరించిన మెరూన్ కలర్ టీ షర్ట్, దుస్తులతో కూడిన ఫోటోను విడుదల చేశారు పోలీసులు. హత్య చేశాక నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, బ్లాక్ ట్రాక్ పాంట్ ధరించాడని చెప్పారు. అదే డ్రస్‌లో నిందితుడు సురేష్ పారిపోయాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే.. డయల్ 100 తో పాటు..

Also read :గిరిజన యువతికి ప్రేమ పేరుతో మోసం.. పదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్ట

అనకాపల్లి జిల్లా రాంబిల్లి కొప్పుగుండు పాలెం బాలిక హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు ఆచూకీ తెలిపితే 50 వేల రూపాయల నగదు బహుమానం ఇస్తామని ప్రకటించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు పోలీసులు. హత్య జరిగి రెండు రోజులు కావస్తున్నా నిందితుడు సురేష్ ఆచూకీ లభించలేదు. బస్టాండ్ లో, రైల్వేస్టేషన్‌, లాడ్జిలతో సహా పోలీసులు అన్నిచోట్ల గాలిస్తున్నారు. నిందితుని ఫోటోలు విడుదల చేస్తూ.. కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రకటించారు.
Also read :Cyber ​Frauds: మహిళలు, యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్.. రెచ్చిపోతున్న మాయగాళ్లు..! సైబర్‌ నేరాలు రోజురోజుకూ

జూలై5 శనివారం రోజున ఇంట్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేసిన నిందితుడు సురేష్ పారిపోయాడు. ప్రేమ పేరుతో వేధించి వెంటపడి నిరాకరించేసరికి కక్ష పెంచుకుని కత్తితో కసితీరా పొడిచి చంపేశాడంటూ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గతంలో కూడా బాలికను వేధిస్తున్న సురేష్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలా జైలుకెళ్లి బెయిల్ పై వచ్చి బాలికను హత మార్చాడని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు.

Also read :Andhra Pradesh: అయ్యో దేవుడా.. ఇంటర్వ్యూకి హాజరై చంటిబిడ్డతో ఇంటికి బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ప్రమాదం..

బాలికను హత్య చేసిన నిందితుడు సురేష్.. ఆ తరువాత రక్తపు మరకలు అంటుకున్న డ్రస్‌ను మార్చుకుని పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య జరగడానికి ముందు నిందితుడు ధరించిన మెరూన్ కలర్ టీ షర్ట్, దుస్తులతో కూడిన ఫోటోను విడుదల చేశారు పోలీసులు. హత్య చేశాక నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, బ్లాక్ ట్రాక్ పాంట్ ధరించాడని చెప్పారు. అదే డ్రస్‌లో నిందితుడు సురేష్ పారిపోయాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే.. డయల్ 100 తో పాటు.. 9440796084, 9440796108, 9440904229, 7382625531 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Also read :Andhra Pradesh: ఆడపిల్లలు పుట్టడమే శాపమా?.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. భర్త చనిపోయిన నెలకే..

Related posts

Share this