December 12, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Andhra Pradesh: దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.. పోలీసుల వినూత్న నిర్ణయం

ప్రస్తుతం టెక్నాలజీ అన్ని రంగాల్లో పెరుగుతోంది. పోలీసులు కూడా ఈ టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు ఓ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు…


డిసెంబర్ నెలవస్తోంది ఈ నెల మూడో వారం నుంచి పూర్తిగా ప్రజలంతా సెలవులోకి వెళ్లి పోతారు క్రిస్టమస్ , న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు దూరప్రాంతాల్లో ఉన్న తమ ఊళ్ళకి వెళుతూ ఉంటారు, ఎక్కడెక్కడ నుంచో పొట్ట చేత పట్టుకొని విజయవాడకు వచ్చి ఇల్లు అద్దెలకు తీసుకొని లేదా విజయవాడ వచ్చి ఇక్కడే సెటిలై తమ బంధువుల ఇళ్లల్లో సెలబ్రేషన్స్ కోసం వెళుతూ ఉంటారు. ఈ సమయంలోనే తమకు అనుకూలంగా మార్చుకున్న దొంగలు ప్రతి ఏడాది డిసెంబర్ రెండూ మూడు వారాల నుంచి జనవరి మొదటి వారంలోని రెక్కి వేసి మరి ఇళ్లను దోచేస్తూ ఉంటారు.


దీంతో నిత్యం ఇల్లు గుల్ల చేసుకున్న బాధితులు పోలీస్ స్టేషను చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి పరిస్థితులు ఇకపై బెజవాడలో పునరావృతం కాకుండా ఉండేందుకు బెదవాడ పోలీసులు వినూత్నంగా ఎల్ హెచ్ ఎం ఎస్ ద్వారా ప్రజలకు భరోసా ఇస్తున్నారు. లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఉళ్ళకు వెళ్లే వారి ఇళ్ళను లాక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి భరోసా ఇస్తామని పోలీసులు అంటున్నారు.ఎవరైన దొంగతనాలకు పాల్పడాలని తాళం వేసి ఉన్న ఇళ్లకు వస్తే వారి భరతం పడతామని హెచ్చరిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టం ద్వారా 33 వేల రిక్వెస్ట్లు ప్రజల నుంచి వచ్చాయి.వాటిని నమోదు చేసుకున్న బెజవాడ పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో వాటిని లక్షకు పెంచాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ చైతన్యం తెస్తున్నారు ఎల్.హెచ్.ఎం.ఎస్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఆ ఇళ్లను లైవ్ ట్రాకింగ్ ద్వారా మానిటర్ చేస్తారు.

అందుకోసం ప్రత్యేక పోలీసులు టీమ్స్ సైతం సిద్ధం అయ్యాయి.టెక్నికల్ టీంతో పాటు ఎవరైతే ఊర్లకు వెళ్తారో ఆయా నివాసాల్లో ఎల్ హెచ్ ఎం ఎస్ ద్వారా ట్రాకింగ్ చేయడంతో ఆయా నివాసాల అనుమానాస్పదంగా కనిపించిన, ఎవరైనా అనుమానం వచ్చిన దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు అన్న సమాచారం వచ్చిన నిమిషాలు అక్కడికి పోలీసులు చేరుకుంటారు వెంటనే దొంగలను అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలిస్తారు ఇలా నిమిషాల వ్యవధిలో దొంగలను పట్టుకోవడం ఊళ్లకి వెళ్ళిన ప్రజల ఇల్లు గుల్ల కాకుండా వారిని సేవ్ చేయొచ్చని పోలీసులు అంటున్నారు.

ఎల్ హెచ్ ఎం ఎస్ లో ప్రతి ఒక్కరూ రిక్వెస్ట్ నమోదు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఎల్ హెచ్ ఎం ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ కాగానే రిజిస్టర్ అవ్వాలి రిక్వెస్ట్ ఫర్ పోలీస్ వాచ్ పెట్టి ఫర్గెట్ యూజర్ ఐడి ఒకదాని రిజిస్టర్ కింద ఒకటి ఉంటాయి అందులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత పేరు మొబైల్ నెంబరు జిల్లా నగరం పట్టణం ఇంటి నెంబరు చిరునామాతో పూర్తిగా రిజిస్టర్ చేసుకొని గెట్ మై కరెంట్ లొకేషన్ క్లిక్ చేయాలి రిజిస్టర్ పై క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది అనంతరం మొబైల్ కు ఐడి నెంబర్ పాస్వర్డ్ వస్తుంది దీన్ని యూజర్ ఐడి లో ఉపయోగించుకొని పోలీసు వాచ్ రిక్వెస్ట్ పంపాలనుకున్నప్పుడు ఐడి తప్పనిసరిగా నమోదు చేయాలి. అలాగే యాప్ ఓపెన్ చేయగానే రిజిస్టర్ కిందకు వెళ్లి రిక్వెస్ట్ పోలీసు వాచ్ పై క్లిక్ చేసి యూజర్ ఐడి ఉన్న కాలంలో దాన్ని ఎంటర్ చేయాలి.

స్మార్ట్ డేట్ ఉన్నచోట ఏ రోజు ఊరు వెళ్తున్నాము నమోదు చేసి దిగువన స్టార్ట్ టైం ఏ సమయానికి ఇంటి తాళం వేసుకొని వెళ్తున్నారు నమోదు చేసి ఏ తేదీలో వస్తామో అక్కడ ఇన్ డేట్ మెన్షన్ చేసి ఆ సమయం వరకు ఉన్నారు లేదో తెలపాలి వివరాలన్నీ నమోదు చేసేక సబ్మిట్ వాచె నీ క్లిక్ చేయాలి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక పోలీస్ కంట్రోల్ రూమ్ కు పోలీస్ స్టేషన్‌కు అలర్ట్ వెళ్తుంది ఈ అలర్ట్ మొత్తాన్ని సిసిఎస్ లోని టెక్నికల్ టీమ్‌ సిబ్బంది వచ్చి ఆ ఇంటిని పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.

ఎవరైనా తలుపులు పగలగొట్టిన ఇంటి ముందు సంచరించినా కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్ వెంటనే అలర్ట్ అవుతుంది ఈ టెక్నికల్ టీం ఎప్పటికప్పుడు వైర్‌లెస్‌ సెట్‌లో ట్రాకింగ్ ద్వారా ఆయా పరిసర ప్రాంతాల్లో ట్రాక్ చేస్తూ ఉంటారు పెట్రోలింగ్ సిబ్బంది సమీపంలో ఉన్న పోలీసులు తక్షణమే అక్కడికి వాలిపోతారు ఎవరైనా దొంగలు వస్తే వారిని అదుపులో తీసుకొని స్టేషన్ కు తరలిస్తారు. ఎల్ హెచ్ ఎం ఎస్ ద్వారా దొంగల బారిన పడకుండా ఉండాలంటే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరికైనా ఆపద ఉంటే నిమిషాలు వ్యవధిలోనే పోలీస్ శాఖ స్పందిస్తుందని సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఈ టెక్నాలజీని వాడుకుంటే ఎవరు కూడా దొంగల బారిన పడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని పోలీసులు సూచిస్తున్నారు.

Also read

Related posts

Share via