April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: దారుణం.. మేత కోసం మేకలను తోలుకొని వెళ్లి.. శవమై కనిపించిన మహిళా..!

రాను రానూ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. మనిషి అన్న కనికరం లేకుండాపోయింది. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా మేకల కోసం ఎంతకూ తెగించారు. మేకల కోసం మహిళను హత్య చేసిన సంఘటన శ్రీసత్య సాయి జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది. హిందూపురం మండలం మలుగూరు గ్రామ శివారులోని పొలాల్లో దారుణం చోటుచేసుకుంది. మేకల కాపరి జయమ్మ అనే మహిళను గొంతు నులిమి గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మహిళా మేకల కాపరిని హత్య చేసి 20 మేకలను దుండగులు ఎత్తుకెళ్లారు.

ఉదయం మేకలు తోలుకొని మేత కోసం వెళ్లిన జయమ్మ సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. మేకల కాపరి జయమ్మ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులోని పొలాల్లో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో మహిళా మృతిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన మహిళ మేకల కాపరి జయమ్మగా గుర్తించారు.

మృతురాలి మెడపై గొంతు నులిమి చంపినట్లు గాయాలను చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేత కోసం మేకలను తోలుకొని వెళ్లిన జయమ్మ శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేకల కోసమే జయమ్మను గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు

Also read

Related posts

Share via