పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మన్యం జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒడిస్సా నుండి పెద్ద ఎత్తున వస్తున్న నీటితో గెడ్డలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే పాచిపెంట మండలం..
పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మన్యం జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒడిస్సా నుండి పెద్ద ఎత్తున వస్తున్న నీటితో గెడ్డలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే పాచిపెంట మండలం కొటికిపెంట ఏకలవ్య స్కూల్ లో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ టీచర్స్ ప్రమాదబారిన పడ్డారు. హర్యానా రాష్ట్రం మహేంద్రఘర్ జిల్లాకు చెందిన ఆర్తి కొటికిపెంట ఏకలవ్య స్కూల్ లో జాగ్రఫీ టిచర్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే హర్యానా రాష్ట్రానికి చెందిన మహేష్ అనే మరో టీచర్ అదే ఏకలవ్య స్కూల్ లో వార్డెన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కేంద్రప్రభుత్వం నిర్వహించిన టీచర్ సెలక్షన్స్‌లో గత మూడు నెలల క్రితం సెలక్ట్ అయ్యారు.
సెలక్షన్స్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని కొటికిపెంట ఏకలవ్య పాఠశాలలో మొదటి పోస్టింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీరు సరాయివలసలో ఉన్న ఏకలవ్య స్కూల్‌లో పనిచేస్తూ స్కూల్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గురునాయుడుపేటలో బ్యాచిలర్ రూమ్స్ తీసుకొని నివాసం ఉంటున్నారు. అలా పాచిపెంట మండలం సరాయివలసలో ఉన్న కొటికిపెంట ఏకలవ్య స్కూల్ నుండి గురునాయుడుపేటకు రోజు బైక్‌పై అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే స్కూల్ సమయం ముగిసిన తరువాత ఇద్దరు కలిసి స్కూటీపై గురునాయుడుపేటకు బయలుదేరారు. అలా కొంతదూరం వెళ్లిన తరువాత సరాయివలస సమీపంలోకి వెళ్లేసరికి కల్వర్టుపై నుండి వట్టిగెడ్డ వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. అయితే ఆ ప్రవహిస్తున్న నీటి లోతు తెలియని మహేష్ స్కూటీపై కల్వర్టుపైకి వెళ్లాడు.
కల్వర్టు దాటుతున్న వారిని గమనించిన రైతులు కల్వర్టు పైన నీరు పెద్దఎత్తున ప్రవహిస్తుంది. మీరు రాకండి, ప్రమాదం అని పెద్దపెద్దగా కేకలు వేశారు. అయితే తెలుగులో హెచ్చరిస్తున్న రైతుల మాటలు హర్యానాకు చెందిన ఇద్దరు టీచర్లకు అర్థం కాలేదు. దీంతో బైక్ పై కల్వర్టు పై ప్రవహిస్తున్న నీటిలో కొంతదూరం ప్రయాణించారు. ఇంతలో నీటి ఉధృతి ఎక్కువగా రావడంతో ఆ ఉదృతికి స్కూటీ సహా స్కూటీ పై వెళ్తున్న టిచర్ ఆర్తి, వార్డెన్ మహేష్ కొట్టుకుపోయారు. వెంటనే ప్రమాదాన్ని గమనించిన రైతులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది.
అలా అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు. అయితే అలా కొట్టుకుపోతున్న సమయంలో మహేష్ ఒక చెట్టును పట్టుకొని ప్రమాదం నుండి బయటపడే ప్రయత్నం చేశాడు. అయినా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ ఉదృతికి కొట్టుకుపోయాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గల్లంతైన టీచర్స్ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆ గాలింపులో ఆర్తి మృతదేహం లభ్యమైంది. అయితే తొలుత మహేష్ ఆచూకీ మాత్రం ఇంకా లభ్యమవ్వలేదు.
తరువాత ప్రత్యేక టీమ్స్ తో గాలించడంతో సరాయివలస సమీపంలో మహేష్ మృతదేహం కూడా లభ్యమైంది. ఇద్దరు హర్యానకు చెందిన వారు కావడంతో వారి యొక్క కుటుంబసభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. రెండు మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ లో వారి స్వగ్రామాలకు తరలిస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆర్తి, మహేష్ మృతితో తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం