SGSTV NEWS online
Andhra PradeshCrime

జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకుల మృతి

👉ఏలూరు జిల్లా….బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గుబ్బల మంగమ్మ జలాశయంలో  ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు  మృతి చెందారు.

స్థానికుల సహాయంతో పోలీసులు రాత్రి సమయం కావడంతో  ట్రాక్టర్ల లైట్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతి దేహాన్ని బయటకు తీశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  ఆదివారం కావడంతో దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం అనంతరం  తిరిగి వస్తుండగా  దొరమామిడి గుబ్బల మంగమ్మ జలాశయంలో ఈతకు దిగి ఇద్దరు తుమ్మల నాగరాజు, తుమ్మల రమణ గల్లంతు అయ్యి మృత్యువాత పడ్డారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి సమయం కావడంతో ట్రాక్టర్ల లైట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts