SGSTV NEWS
Andhra PradeshCrime

అనంతపురంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఒక్కడి కోసం ఇద్దరమ్మాయిలు.. సీన్ కట్ చేస్తే.!

 

ఇన్‌స్టాలో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు ఓ ప్రియుడు. చివరికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కి అసలు విషయం తెలిసేసరికి కంగుతిన్నాడు. అయితే మన ఇద్దరిలో ఒకరికే అతడు దక్కాలని అనుకున్న ప్రియురాళ్ళు చివరికి ఏం చేశారంటే.. ఆ వివరాలు


ప్రియుడి కోసం ప్రియురాళ్ళు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఒక ప్రియురాలు మృతి చెందింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపిన బాయ్‌ఫ్రెండ్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెలిసి ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. బత్తలపల్లికి చెందిన ప్రియుడు దివాకర్ కోసం ముదిగుబ్బకు చెందిన ప్రేయసి రేష్మ, కనేకల్‌కు చెందిన మరో ప్రేయసి శారద సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇద్దరు ప్రియురాళ్ళలో ఒక ప్రియురాలు శారద మృతి చెందింది. మరో ప్రియురాలు రేష్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


ప్రియుడు దివాకర్, ప్రియురాళ్ళు రేష్మ, శారద ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో దివాకర్, రేష్మ ప్రేమించుకున్నారు. మరోవైపు రేష్మ, శారద కూడా స్నేహితులే. రెండు సంవత్సరాల క్రితం ప్రియురాలు రేష్మకు వేరే వ్యక్తితో వివాహం జరగడంతో.. రేష్మ స్నేహితురాలు శారదతో ప్రియుడు దివాకర్ ప్రేమాయణం నడిపాడు. అయితే ప్రియుడు దివాకర్‌ను మర్చిపోలేక.. పెళ్లయిన కొద్ది రోజులకే ప్రియుడు దివాకర్ కోసం రేష్మ.. భర్తను వదిలేసి వచ్చింది. అప్పటికే శారదతో లవ్‌లో ఉన్న దివాకర్.. ఇప్పుడు రేష్మ కూడా భర్తను వదిలేసి రావడంతో.. ఒకరికి తెలియకుండా మరొకరితో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని కంటిన్యూ చేశాడు.

అయితే రేష్మ, శారద ఫ్రెండ్స్ కావడంతో.. ఇన్‌స్టా సంభాషణలో ప్రియుడు దివాకర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ఇద్దరు ప్రేమిస్తున్నది దివాకర్‌నే అని తెలుసుకున్న రేష్మ, శారద.. దివాకర్‌పై ఒత్తిడి చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బాయ్ ఫ్రెండ్ దివాకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇద్దరిలో బాయ్‌ఫ్రెండ్ దివాకర్ ఎవరో ఒకరికే సొంతం కావాలని మొండిపట్టు పట్టిన రేష్మ, శారద.. ఆత్మహత్యాయత్నం చేసుకుని ఎవరు బ్రతికితే వారు ప్రియుడు దివాకర్‌తో కలిసి ఉండాలని మాట్లాడుకుని పురుగుల మందు తాగేశారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయంలో ఎవరూ లేని చోట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.



ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని బాయ్ ఫ్రెండ్ దివాకర్‌కు ప్రియురాలు మెసేజ్ పెట్టారు. విషయం తెలుసుకున్న దివాకర్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న రేష్మ, శారదను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండో ప్రియురాలు శారద మృతి చెందింది. మరో ప్రియురాలు రేష్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాయ్ ఫ్రెండ్ కోసం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీపై అనంతపురం వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు

Also read

Related posts

Share this