మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన వ్యక్తికి అందమైన అమ్మాయి ఫోటో పంపించారు. అమ్మాయి పేరుతో పరిచయం చేసుకున్నారు. మాట మాట కలిపారు. మాయమాటలతో అందికాడికీ లాగేసుకున్నారు. చివరికి అసలు విషయం తెలిసి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. దీంతో ఇద్దరు మోసగాళ్లను పట్టుకున్నారు విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు.
విశాఖకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మ్యాట్రిమోనీ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్మాయిల కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువతి ఫోటో కనిపించింది. క్లిక్ చేస్తే చాటింగ్ మొదలైంది. ఫొటోస్ షేరింగ్ కూడా జరిగింది. కాల్స్‌తో.. మాటలతో దగ్గరయ్యే కొద్దీ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు.
అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తాయని నమ్మించడంతో వలలో పడిపోయాడు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇలా నమ్మించి 46 లక్షల రూపాయల వరకు లాగేశారు. ఆలస్యంగా మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. ఇప్పటికే ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని తాజాగా పట్టుకున్నారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాలకు బ్యాంకు ఎకౌంట్లు సమకూర్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆదిత్య పాత్ర, రూపం సోములను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు.
దీంతో సోషల్ మీడియాలో సైట్లలో అందమైన అపరిచిత అమ్మాయిల ఫోటోలు చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 - Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
 





