నందికొట్కూరు మహిళ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. తన తండ్రిని చంపిందనే కారణంగానే 9ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు పగ తీర్చుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరులో మహిళ దారుణం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నందికొట్కూరు పట్టణంలోని మారుతినగర్ లో నివాసముంటున్న శాలుబీ గురువారం(సెప్టెంబర్ 5) అర్ధరాత్రి వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్, నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ తో ఆ స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. శాలుబీని చందు అనే యువకుడు, బీహార్‌కి చెందిన వ్యక్తులతో కలిసి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది.
ఈకేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇంట్లో ఉన్న శాలుబీని నాటు తుపాకీతో చంపినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బయటపడింది. శాలుబీ మృతదేహంలో నాటు తుపాకీ బుల్లెట్లను గుర్తించారు. నిందితుల్లో బీహార్ యువకుడి గదిలో రెండు నాటు తుపాకులు, 8బుల్లెట్లను గుర్తించినట్లు సమాచారం. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మర్డర్ కేసు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హత్యకు గురైన శాలుబీ పై కూడా సస్పెక్ట్ షీట్‌లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆమెపై నందికొట్కూరులో పీఎస్‌లో 6 కేసులు, కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో 4 కేసులు నమోదయ్యాయి. హత్య, పలు చోరీ కేసుల్లో శాలు బీ నిందితురాలిగా ఉంది. 2015లో నందికొట్కూరులో గజేంద్ర అనే వ్యక్తిని హత్య చేసింది శాలుబీ. ఆ హత్యకు ప్రతీకారంగానే శాలుబీని బీహార్ యువకునితో కలసి హత్య చేశాడు గజేంద్ర కుమారుడు చందు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పోలీసులు.. శాలుబీ హత్యపై కీలక విషయాలను గోప్యంగా ఉంచారు
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!