July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తిరుపతిలో దారుణం! శివయ్య సేవ కి వెళ్తే.. ఆయనే కరుణ చూపలేదు!

వేసవి కాలం కావడంతో సరదాగా తల్లిదండ్రులతో దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు మరణించిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ప్రస్తుతం వేసవి కాలం, అందరికీ స్కూల్స్‌ సెలవులు కావడంతో పిల్లలందరూ ఈ సమ్మార్‌ హాలీడేస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది పిల్లలు తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు వెళ్లడం, సరదా కోసం చెరువులు,బావులకు ఈతకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా సరదాగా అడుకోవడానికి వెళ్లిన పిల్లలు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వేసవిలు కావడంతో ఆలయాలను సందర్శించడానికి తన తల్లిదండ్రులతో  వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతి చెందరు. అయితే ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు కావడం గమన్హారం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సమ్మార్‌ హాలీడేస్‌ కావడంతో ఇంటిపాటునే ఉండి అడుకోవాల్సిన పిల్లలకు దేవుడి మీద భక్తితో తల్లిదండ్రులతో కలిసి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. దేవుడి దర్శనం అనంతరం చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ బాబు, విజయశాంతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే వారందరూ తమిళనాడులోని అరుణచలేశ్వరుడి దర్శనానికి గురువారం వెళ్లారు.

కాగా, విజయశాంతి.. తన ముగ్గురు కుమార్తెలు మూషిక(16), చరిత(13), రూపిక(11)తో కలిసి స్థానిక గూళూరు చెరువు కట్టపై ఉన్న పురాతన శివాలయానికి దీపారాధన చేసేందుకు సాయంత్రం వెళ్లారు. అనంతరం అక్కడి చెరువులో దీపాలు వదిలేందుకు మెట్ల మార్గం ద్వారా కిందకి దిగారు. అయితే ఇంతలోనే కాళ్లు కడుక్కునేందుకు ప్రయత్నిస్తుండగా.. మెట్లు పాచి పట్టి ఉండటంతో అందరూ జారి చెరువులో పడిపోయారు. ఇక కళ్లెదుటే కుమార్తెలు నీట మునిగిపోతుండటంతో విజయశాంతి కేకలు వేశారు

దీంతో సమీపంలో ఉన్న గూళూరు దళితవాడకు చెందిన వెంకటరమణ, ఎస్‌బీఆర్‌పురానికి చెందిన మోహన్‌ వచ్చి విజయశాంతిని కాపాడగా.. ముగ్గురు పిల్లలు మాత్రం అప్పటికే మునిగిపోయారు. అయితే వారిని బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే వారు మృతి చెందారు. ఇక కళ్లేదుటే.. తన ముగ్గురు పిల్లల ప్రాణాలు పొగొట్టుకున్న ఆ తల్లి ఎంతగానో రోధన స్థానికులకు కంటతడి పెట్టించింది. కాగా, మృతదేహాలను పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు సీఐ ఓబులేశు తెలిపారు.

Also read

Related posts

Share via