December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Tirupati: టెంపుల్ సిటీలో పెంపుడు కుక్క హత్య.. పోలీసులకు ఫిర్యాదు.. స్టేషన్‌ ముందు ఆందోళన

తిరుపతిలో పెంపుడు కుక్క హత్యకు గురైంది. స్కావెంజర్స్ కాలనీలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. కుక్క మోరిగిందన్న సాకుతో మచ్చు కత్తితో నరికి చంపారని లావణ్య అనే మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. కుక్క మర్డర్ కేసును పట్టించుకోని పోలీసుల తీరును తప్పు పడుతూ ఆందోళన కూడా చేపట్టింది..

టెంపుల్ సిటీ తిరుపతి లో టామీ అనే డాగ్ హత్యకు గురైంది. తిరుపతి స్కావెంజర్స్ కాలనీ లో ఉంటున్న లావణ్య అనే మహిళ ఇంట్లోని పెంపుడు కుక్క హత్యకు గురైందన్న ఫిర్యాదు తిరుపతి ఈస్ట్ పీఎస్‌కు చేరింది. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కుక్క మొరిగిందన్న సాకుతో కుక్కను మచ్చు కత్తితో నరికి చంపినట్టు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న లావణ్య నిన్న సాయంత్రం ఇంట్లో ఇద్దరు పిల్లల వద్ద పెంపుడు కుక్క టామీ ని వదిలి బయటకు వెళ్ళింది. ఎదురింటిలో ఉన్న సాయికుమార్, శివ కుమార్ లను చూసి కుక్క మొరిగింది.

ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పటికే మనస్పర్ధలు ఉండగా, ఏడాదిన్నర క్రితం కూడా గొడవ జరిగింది. నిన్న సాయంత్రం లావణ్య పెంపుడు కుక్క శివకుమార్ ను చూసి మొరగడంతో కుక్క పై రాడ్, కత్తి తో దాడికి పాల్పడ్డారు. దాదాపు 15 చోట్ల కత్తి నరికి చంపారు. లావణ్య ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల ఎదుట ఈ ఘటన జరగా పిల్లలు భయంతో లావణ్య కు ఫోన్ చేసారు.

కుక్కను హత్య చేసినట్లు లావణ్య కు చెప్పారు. దీంతో వెంటనే లావణ్య కుక్క హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో తిరుపతి ఈస్ట్ పీఎస్ లో ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చింది. కుక్క మోరగడంతో ఎదురింటిలో ఉన్న శివకుమార్, సాయి కుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొంది. 4 ఏళ్లుగా పెంచుకుంటున్న కుక్కను కిరాతకంగా నరికి చంపారని పోలీసులకు చెప్పింది.


నమోదు చేయమని లావణ్య పోలీసులను వేడుకుంది. అయితే కుక్క హత్య కేసు ఫిర్యాదు ను ఎస్సై బాలకృష్ణ పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కుక్కను చంపిన నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, వారిని అరెస్టు చేయకుండా పోలీసులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని తప్పు పట్టారు. చనిపోయిన కుక్కకు పోస్టుమార్టం పూర్తి అయ్యాక కుటుంబ సభ్యులతో కలిసి కుక్కను పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్ళి ఆందోళనకు దిగింది. న్యాయం కోసం రోడ్డెక్కిన లావణ్య కుక్కను కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది లావణ్య

Also Read

Related posts

Share via