సాగర్ కాలువలో ఈతకి వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా దర్శి నాగర్జున సాగర్ బ్రాంచ్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన మూడు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తపల్లి, కొర్లమడుగు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన ముగ్గురు స్నేహితులు సరదాగా ఈతకు వెళ్లి సాగర్ కాలువలో గల్లంతయ్యారు. వారిలో కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేష్ రెడ్డి (19) మృతదేహం లభ్యం కాగా.. గల్లంతయిన మరో ఇద్దరు యువకులు కొర్లమడుగు,లక్ష్మీపురం గ్రామాలకు చెందిన కుందూరు కిరణ్ కుమార్ రెడ్డి (19)బత్తుల మణికంఠ రెడ్డి (19)గా స్థానికులు గుర్తించారు.
గల్లంతైన ముగ్గురు విద్యార్థులు దర్శిలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు మృతుల బంధువులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా కానరాని లోకాలకు వెళ్ళటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనతో మృతుల గ్రామాల్లోని బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న దర్శి డిఎస్పి, సీఐ, ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గల్లంతైన మిగతా ఇద్దరి కోసం గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం