November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

దొంగలు బాబోయ్‌..! బడి, గుడి అన్నీ గుల్ల చేస్తున్నారు.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు

ఆలయంలో దొంగతనాలకు పాల్పడితే పోలీసులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడంతో దొంగలు ఇదే అదునుగా.. ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయాలే టార్గెట్‌గా లూటీలకు పాల్పడుతున్న కేటుగాళ్లను త్వరగా పట్టుకోవాలని భక్తులు, స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.


ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలయాలలో వరుస చోరీలతో దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. గత మూడు నెలలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదుల సంఖ్యలో ఆలయాలలో దొంగలు తాళాలు పగలగొట్టి హుండీలను, అలాగే ఆలయాల్లో ఉన్న ఆభరణాలను దొంగతనాలు చేస్తున్న పోలీసులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. ఇంతవరకు ఆలయంలో దొంగతనాలకు పాల్పడ్డ వారిని అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆత్మకూరు సబ్ డివిజన్లోని రెండు నెలల వ్యవధిలో ఏడు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు దొంగలు..తాజాగా ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.


ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటికి, మాజి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటికి అతి చేరువలో ఉన్న శివాలయంలో దొంగలు లూటీకి పాల్పడారు. శనివారం తెల్లవారుజామున దుండగుడు ఆలయానికి ఉన్న తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి హుండీ లోని నగదును ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చోరీ అనంతరం ఆ దొంగ వెళుతూ వెళుతూ ఒక సీసీ కెమెరా కూడా పగలగొట్టాడు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన అర్చకులు గుడిలో చోరీ జరిగినట్టుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పరిసరాలతో పాటు, సీసీ ఫుటేజ్‌ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఆలయంలో దొంగతనాలకు పాల్పడితే పోలీసులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడంతో దొంగలు ఇదే అదునుగా.. ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయాలే టార్గెట్‌గా లూటీలకు పాల్పడుతున్న కేటుగాళ్లను త్వరగా పట్టుకోవాలని భక్తులు, స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు



Also read

Related posts

Share via