July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: అత్యంత పాశవికంగా కుక్కను చంపిన వ్యక్తి.. పోలీసుల విచారణలో సంచలనం!

మే 16వ తేదీ అర్థరాత్రి పన్నెండు గంటల సమయం దాటింది. అడపా దడపా ఇన్నర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నాయి. అదే సమయంలో ఒక వ్యక్తి కత్తి పట్టుకుని కనిపించాడు. ఎవరా అని ఆరా తీస్తే సితార చికెన్ స్ఠాల్ ఎదురుగా కుక్క పడిపోయి ఉంది. దానిపై ఆ వ్యక్తి విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు

వీధి కుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాటిపై దాడి చేసిన చంపినా యానిమల్ లవర్స్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ ఏడాది జనవరిలో గుంటూరు నగరంలో జరిగిన రెండు ఘటనలు స్థానికులను బెంబేలెత్తించాయి. సంపత్ నగర్ ప్రాంతంలో ఇద్దరూ చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి కుక్కలను తరిమి వేయడంతో చిన్నారులు ప్రాణాలు దక్కాయి. అయితే తాజాగా గుంటూరు నగరంలో జరిగిన మరోక ఘటనపై స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

మే 16వ తేదీ అర్థరాత్రి పన్నెండు గంటల సమయం దాటింది. అడపా దడపా ఇన్నర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నాయి. అదే సమయంలో ఒక వ్యక్తి కత్తి పట్టుకుని కనిపించాడు. ఎవరా అని ఆరా తీస్తే సితార చికెన్ స్ఠాల్ ఎదురుగా కుక్క పడిపోయి ఉంది. దానిపై ఆ వ్యక్తి విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కుక్క అక్కడికక్కడే చనిపోయింది. దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న సుమంత్ అనే వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే దాడి చేసిన వ్యక్తి మాత్రం సుమంత్ ను లెక్కచేయకుండా కుక్కను నరికి చంపేశాడు. అత్యంత్య పాశవికంగా దాడి చేయడంపై యానిమల్ లవర్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేకాకుండా యానిమల్ లవర్స్ అంతా కలిసి నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గొల్లవారిపాలెంకు చెందిన గోపి అనే యువకుడు సితార చికెన్ స్టాల్లో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా చికెన్ స్టాల్‌లోని కోళ్లు మాయం అవుతున్నాయి. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన గోపికి కుక్కే కోళ్లను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. ఈ విషయంపై యజమాని రోజు గోపిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆ కుక్కపై కక్ష పెంచుకున్నాడు. దీంతో అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన కుక్కపై కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే యానిమల్ లవర్స్ నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తిపై చర్చలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారం ఐపిసి 428,429 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

Also read

Related posts

Share via