November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

Andhra Pradesh: రూ. 30కోట్ల పందెం సొమ్ముతో మధ్యవర్తి మాయం.. బెట్టింగ్ రాయుళ్లులో కలవరం!





భీమవరంలో పందెం రాయుళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పందాలుకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి పరారవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గెలిచిన పందెం డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఎవరు గెలుస్తారో.. ఎవరు వాడతారో.. తెలియని అయోమయ పరిస్థితి ఎన్నికల ముందు నెలకొంది. కొన్ని సర్వే సంస్థల పోల్స్ ఆధారంగా పోటీలో నిలిచిన అభ్యర్థులు, పార్టీలు, మెజారిటీలు ఎవరికి తగ్గ రీతిలో వారు జోరుగా పందాలు కాశారు. అయితే ఎన్నికల్లో ఫలితాలు వెలువడటంతో కొందరు పందాలు కాసి నష్టపోగా, మరికొందరు గెలిచిన పందెం డబ్బులు రాక గగ్గోలు పెడుతున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాలలో కోట్లాది రూపాయలు పందాలు జరిగాయి. పందెం రాయుళ్లు ముందుగా పందాలు కాసేటప్పుడు ఓ మధ్యవర్తి సమక్షంలో పందేలు కాస్తారు. పందేలు కోసే ఇద్దరు వ్యక్తులు సంఘటన డబ్బులను మధ్యవర్తి సమక్షంలో ఉంచుతారు. పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకుని మిగిలిన పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలోనే భీమవరం సమీపంలో రాయలం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ఇరు పార్టీల పందం రాయుళ్ళఉ పెద్ద మనిషిగా ఉంచారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన పందెం రాయుళ్ళు బెట్టింగ్ కోసం తెచ్చిన డబ్బును సదరు మధ్యవర్తి దగ్గర ఉంచి గెలిచిన తర్వాత 5 పర్సెంట్ కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగతా డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.

ఇలా మొత్తం సుమారు 30 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల అనంతరం పందాలు గెలిచిన వ్యక్తులు సంతోషంగా తమకు డబ్బు వస్తుందని ఆశించారు. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్లగా, అతని జాడ ఎవరికీ చిక్కలేదు. దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడా అని ఆరా తీశారు. కానీ అతను ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు. మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదు అన్నట్లుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పందెం రాయుళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఒకవేళ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పందెం కాయడం చట్ట వ్యతిరేకం. అందుకే ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు నమోదు చేస్తారేమో అని భయపడుతున్నారు. పందాలు కాసిన వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మధ్యవర్తి కోసం వెతుకులాట మొదలుపెట్టారట.

Also read

Related posts

Share via