March 15, 2025
SGSTV NEWS
Andhra Pradesh

Andhra Pradesh: ఆరు అడుగుల జాగా కోసం ఇంత గొడవ.. నెలల తరబడి ఉద్రిక్త వాతావరణం!



గత వారం రోజులుగా స్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజికవర్గాలు మద్య భూ వివాదం కొనసాగుతోంది. రెండు సామాజికవర్గాల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంది. ఉన్నత ఆధికారులు సమస్య తొందరగా పరిష్కారించక పోతే సమస్య మరింత ఉధృతం అయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.

కర్నూలు జిల్లాలో స్మశానం కోసం జరిగిన ఘర్షణతో నెలల తరబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రాలయం మండలం చెట్నహల్లిలో శ్మశానం స్థలంలో రోజు రోజుకు ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. తప్పా తగ్గేదీలేదంటున్నారు గ్రామస్తులు. ఒకే స్మశాన వాటిక కోసం BC, SC సామాజికవర్గాల మధ్య రచ్చ కొనసాగుతోంది. అయితే ఐదు రోజుల క్రితం చనిపోయిన మాల బుడ్డయ్య మృతదేహానికి శ్మశానంలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్నారు ఎస్సీ వర్గీయులు. దీంతో గ్రామంలో నిప్పుపై పెట్రోల్ పోసినట్టు అయింది. దీంతో మరోసారి అగ్గి రాజుకుంది.


10 రోజుల క్రితం రుద్ర భూమి యుద్ధ భూమిగా మారింది. దళితులకు, బిసి సామాజిక వర్గానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాలలో బిసి వర్గానికి చెందిన 50 మంంది, ఎస్సీ వర్గానికి చెందిన 30 మంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐదు రోజుల క్రితం మాల బుడ్డయ్యను శ్మశానంలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో మృతదేహాన్ని తాసిల్దార్ కార్యాలయం ముందు ఉంచుతామని రెవెన్యూ అధికారులకు హెచ్చరించారు బంధువులు.

దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు దళితులకు సర్దిచెప్పడంతో చివరికి దహన సంస్కారాలు స్మశాన వాటికలో జరిగాయి. దశాబ్దాలుగా స్మశానం అక్కడే ఉండేదని గ్రామస్తులు వాపోతున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు శవాలను అక్కడే పూడిసేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. రుద్రభూమి యుద్ధ భూమిగా రగిలిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏదో ఒకటి పరిష్కారం చేస్తే తప్ప ఈ ఘర్షణలు జరగకుండా ఉంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.


మంత్రాలయం మండలంలోని చెట్నహల్లి గ్రామంలో 113 సర్వే నెంబరులో 8.83 ఎకరాల రస్తా పోరంబోకు ఉంది. ఇందులో 40 సెంట్లు హైవే రోడ్డుకు, 42 సెంట్లు గురుబోధ తీసుకున్న వారి సమాధుల కోసం, మిగిలిన 22 సెంట్ల స్థలాన్ని గ్రామ రస్తాకు కేటాయించారు. ఇందులో ఉన్న 1.37 ఎకరాల స్థలాన్ని అన్ని కులాల వారు గత 70 ఏళ్లుగా శ్మశానానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇదే సర్వే నెంబరులోని 1.42 ఎకరాల భూమిలో గత ప్రభుత్వం జగనన్న కాలనీ ఎస్సీలకు ఏర్పాటు చేసింది. దీంతో అసలు సమస్య మొదలైంది.

ప్రభుత్వ రస్తా పోరంబోకును తరతరాలుగా శ్మశానం వాటిక కింద ఉపయోగించుకుంటున్నారు. జగనన్న కాలనీ పేరుతో శ్మశానాన్ని రద్దు చేయాలని చూస్తే సహించేది లేదంటున్నారు గ్రామస్తులు. శ్మశానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని బీష్మించుకుని ఉన్నారు. ప్రభుత్వం గ్రామానికి అనుకుని ఉన్న రస్తా పోరంబోకు స్థలానికి ప్రహరీ కట్టించి అన్ని కులాలకు ఇక్కడే శ్మశాన స్థలంగా ఉంచాలంటున్నారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. ఈ శ్మశాన స్థలాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అంటున్నారు గ్రామస్తులు.

బిసి సామాజిక వర్గానికి చెందిన మహిళలు సమస్య పరిష్కరించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి స్మశాన వాటిక స్థలం పరిశీలించారు రెవిన్యూ అధికారులు. తొందరలో స్మశాన వాటిక సమస్య పరిష్కరిస్తామని ఇరువర్గాలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నచ్చజెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా స్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజికవర్గాలు మద్య భూ వివాదం కొనసాగుతోంది. రెండు సామాజికవర్గాల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంది. ఉన్నత ఆధికారులు సమస్య తొందరగా పరిష్కారించక పోతే సమస్య మరింత ఉధృతం అయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.

Also read

Related posts

Share via