ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఏకంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కారును ఆపి నానా హంగమా చేశారు.. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టేసి.. ‘‘ఎవడ్రా నువ్వు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది’’.. అంటూ వీరంగమేశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం మసకపల్లిలో చోటుచేసుకుంది. ఫుల్లుగా మద్యం తాగి.. గంజాయ్ కొట్టిన ఆరుగురు యువకులు మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ మసకపల్లిలో ను అడ్డుకున్నారు. మంత్రి సుభాష్ వరద ముంపు ప్రాంతంలో పర్యటించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. చాలా సేపటి వరకు మందుబాబులు హల్చల్ చేశారు.. ఆ తర్వాత మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also read :Bizarre: బాబోయ్ కోళ్ల దొంగలు.. రెండ్రోజుల్లో ఏకంగా 30 కోళ్లు మాయం.. రెక్కి నిర్వహించి మరీ..!
కాగా.. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న ఆరుగురు మందుబాబులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మందుబాబులు రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా మట్లపాలెం వెళ్లి కడియాలు తీసేసి(మందు తాగకుండా వేసిన కడియాలు) యానాంలో మందు తాగారు.. అనంతరం ఏటుగట్టు మీదుగా రాజమండ్రి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read :Maharashtra: విడాకులు తీసుకున్న స్త్రీలు, వితంతువులే అతని టార్గెట్.. ఏకంగా 25 పెళ్లిళ్లు..