December 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

విశాఖ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలనాలు.. పోలీసుల అదుపులో ఫారెస్ట్‌ అధికారి!

జాయ్‌ జెమీమా కేసులో వేణు భాస్కర్‌రెడ్డి కీలక సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొన్నాళ్లుగా ఆయన కోసం ముమ్మరంగా గాలించారు.



సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసులో ఫారెస్ట్‌ అధికారి వేణు భాస్కర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో దుమారం రేపిన జాయ్‌ జెమీమా హనీట్రాప్‌ కేసుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీసులు.. పలు కీలక విషయాలను సేకరించారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్‌ అధికారి వేణు భాస్కర్‌రెడ్డి వ్యవహారం బయటపడింది. జెమీమా, వేణు భాస్కర్‌రెడ్డి మధ్య భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది.


జాయ్‌ జెమీమా కేసులో వేణు భాస్కర్‌రెడ్డి కీలక సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొన్నాళ్లుగా ఆయన కోసం ముమ్మరంగా గాలించారు. అయితే జెమీమా అరెస్ట్‌ తర్వాత పోలీసుల కళ్లుకప్పి తప్పించుకు తిరుగుతున్న వేణు భాస్కర్‌రెడ్డిని ఎట్టకేలకు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం విచారణ చేపట్టారు.

జాయ్‌ జెమీమా.. పలువురు ధనవంతులు, అధికారులు, ఎన్నారైలకు అందమైన ఫోటోలను పంపి వారిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది. హనీట్రాప్‌ ద్వారా రూమ్‌కు పిలిపించుకోవడం.. వారికి మత్తు మందు ఇచ్చి నగ్న ఫొటోలు తీసి, వాటితో బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడింది. అయితే, జాయ్‌ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై వేట కొనసాగిస్తున్నారు విశాఖ పోలీసులు. ఈ క్రమంలోనే ఫారెస్ట్‌ అధికారి వేణు భాస్కర్‌రెడ్డి బాగోతం బట్టబయలు అయింది. దీంతో పక్కా సచారంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Also read

Related posts

Share via