February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kakinada: అన్నవరం టెంపుల్‌లో రూ. 5 కోసం కక్కుర్తి.. ఫైనల్‌గా 5 లక్షలు చెల్లించుకున్నాడు

 

దేవుడి సన్నిధిలో కక్కుర్తి పడితే ఫలితం ఇలానే ఉంటుంది. అసలుకే మోసం వస్తుంది. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంకు భక్తులు విపరీతంగా వెళ్తుంటారు. మొక్కులు చెల్లించి.. చల్లగా ఉండేలా ధీవించాలని దేవుడ్ని వేడుకుంటారు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులను దోచేయాలని భావించాడు ఓ కాంట్రాక్టర్. పవిత్ర సన్నిధిలోనే ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ఆఖరికి ఫలితం చెల్లించుకున్నాడు.

కాకినాడ జిల్లా అన్నవరం టెంపుల్‌లో రూల్స్ పాటించకుండా..  అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్ కౌంటర్‌ గుత్తేదారుకు రూ.5లక్షల భారీ ఫైన్ విధించింది కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం. ఈ మేరకు ఫోరం అధ్యక్షులు, సభ్యులు తీర్పు వెలువరించారు. 2024, నవంబర్‌ 3న కాకినాడకు చెందిన లాయర్ జల్లిగంపల లక్ష్మీనారాయణ అన్నవరం టెంపుల్‌కు వెళ్లారు. గుడిలోని ఓ డిపాజిట్‌ కేంద్రంలో మొబైల్ ఉంచారు. దర్శనం అనంతరం ఫోన్ తీసుకునేందుకు డిపాజిట్ సెంటర్‌కు వెళ్లారు.

అయితే రూ.10 చెల్లిస్తే ఫోన్ ఇస్తామని సిబ్బంది చెప్పారు. అయితే రూ.10 రుసుం గురించి  బోర్డుపై ఎందుకు రాయలేదని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. వెంటనే ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.. వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో డిసెంబర్‌ 4న కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేశారు. వారు విచారించగా..  రూ.5 వసూలు చేసేందుకే పర్మిషన్ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వినియోగదారుల ఫోరం.. లక్ష్మీనారాయణ దగ్గర నుంచి అదనంగా వసూలు చేసిన రూ.5తో పాటు మానసిక క్షోభకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. సదరు కాంట్రాక్టర్.. అన్నవరం టెంపుల్‌కు రూ.5 లక్షలు ఫైన్ కట్టాలని ఫోరం తీర్పు ఇచ్చింది. దేవడి సన్నిదిలో కథలు పడితే.. రిజల్ట్ ఇలానే ఉంటుంది మరి

Also read

Related posts

Share via