June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

విమాననగర్‎లో వింత వింత శబ్దాలు.. అర్థరాత్రి రోడ్లపైకి జనం.. జరిగిందిదే..

అది విశాఖలోని నడిబొడ్డున ఉన్న ప్రాంతం. విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఉంది. పేరు కూడా విమాన నగర్. ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటి నుంచి అర్ధరాత్రి పూట వింత శబ్దాలు వస్తున్నాయి. దీంతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది. విశాఖ విమాన నగర్‎లో క్షుద్ర పూజల కలకలం రేగింది. తొమ్మిదో నెంబర్ లైన్‎లో బోరా రాజేష్ అనే డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. అర్ధరాత్రి క్షుద్ర పూజ చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. దీంతో ఒక్కటే హడావుడి.. ఆందోళన నెలకొంది. అర్ధరాత్రి అంతా ఆ వీధిలో ఈ విషయం తీవ్ర కలకలం రేపింది. ఈ ఒక్కరోజే కాదట గత పది రోజులుగా అర్ధరాత్రి ఇంట్లో పూజలు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పెద్ద పెద్ద అరుపులతో శబ్ధాలు వినిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మిట్ట మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఏ సమయంలో తిరిగి వస్తున్నాడో తెలియదు అంటున్నారు స్థానికులు. ఓ రోజు తలుపు తడితే.. వస్త్రాలు లేకుండా కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు.

Also read :కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం

అందుకే అలా చేస్తున్నాడట..

తాను క్షుద్ర పూజలు చేయట్లేదని అంటున్నాడు రాజేష్. అటువంటివి ఏవైనా ఉంటే నిరూపించాలని సూచిస్తున్నాడు. అప్పుల బాధతో మానసిక ప్రశాంతత కోసమే అలా చేస్తున్నానని అంటున్నాడు. తాను దుర్గాదేవి భక్తుడ్ని కాబట్టి పూజలు చేస్తున్నానని వివరణ ఇచ్చాడు. స్థానికులకు ఇబ్బంది ఉంటే పూజ మానేస్తానంటున్నాడు రాజేష్. కావాలని తన పరువు తీయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడు. అయితే.. పది రోజుల క్రితం ఇలాగే కలకలం రేగితే.. పోలీసుల వచ్చి వెరిఫై చేశారు. క్షుద్ర పూజల ఆధారాలు లేకపోవడంతో వెను వెనుదిరిగినట్టు స్థానికులే చెబుతున్నారు. అయితే ఈసారి ఇంట్లో ఉన్న తనకు పరువు తీసేందుకు స్థానికుల ప్రయత్నిస్తున్నారు అంటూ.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు రాజేష్. మరోసారి ఆ ప్రాంతానికి వెళ్ళిన పోలీసులు స్థానికులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొత్తం మీద రాజేష్ భక్తి.. స్థానికుల భయం.. ఈ రెండూ వెరసి క్షుద్ర పూజల పుకార్లు పుట్టించాయి. ఆ ప్రాంతంలో భయాందోళనకు గురిచేశాయి.

Also read :తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..

వామ్మో మింగేస్తున్న సముద్రం.. ఆ బీచ్‌కు వెళితే.. అంతే సంగతులు..

Related posts

Share via