అనుమానం వచ్చి చెక్ చేయగా..
అదో గెస్ట్ హౌస్.. ముందే ప్లాన్ చేసుకున్నారు.. గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలను రప్పించారు.. ఐదుగురు యువతులు.. పది మంది యువకులు కలిసి.. ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. పోలీసులు రంగంలోకి దిగారు.. దీంతో అసలు గుట్టు రట్టయింది.. ఐదుగురు అమ్మాయిలను, 10 మంది అబ్బాయిలను అదుపులోకి తీసుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
న్యూ ఇయర్ జోష్ మొదలైంది.. ఎక్కడ చూసినా సందడే నెలకొంది.. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు.. డిసెంబర్ 31 వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు యువత సమయాత్తమవుతోంది.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలు, అబ్బాయిల ఓ పార్టీ కలకలం రేపింది.. న్యూ ఇయర్ వేడుకలకు ముందే.. ఐదుగురు అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు గుట్టు చప్పుడు కాకుండా ఓ ప్రాంతంలోని గెస్ట్‌హౌస్ కు చేరుకున్నారు.. ఫుల్లుగా మద్యం.. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే పోలీసులు ఎంటర్ అవ్వండంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి కోరుకొండ మండలం బూరుగుపూడి గెట్ వద్ద అద్భుతః రెసిడెన్సీలో రేవ్ పార్టీ కలకలం రేపింది.. అద్భుతః రెసిడెన్సీలో జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు మెరుపు దాడి చేశారు.. అక్కడ ఐదుగురు యువతులు, 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువతలు గుంటూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.. యువకులు రాజమండ్రికు చెందిన వారుగా పేర్కొంటున్నారు.
వీడియో చూడండి..
ప్రస్తుతం వారంతా కోరుకొండ పోలీసులు అదుపులో ఉన్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. అసలు రెసిడెన్సీ ఎవరిది..? ఈ రేవ్ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు.. ఇంతకు ముందు కూడా ఇలాంటివి నిర్వహించారా.? అసాంఘిక కార్యక్రమాలు ఎప్పటినుంచి కొనసాగుతున్నాయి..? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.. కాగా.. బూరుగుపూడి గెట్ వద్ద అద్భుతః రెసిడెన్సీ లో రేవ్ పార్టీ నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది
Also Read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..