June 26, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

కాకినాడ: అమ్మవారి ఆలయంలో ఇదేం పనిరా.. అమ్మో మహానటుడు.. సీసీటీవీ

ఆలయాల్లోని హుండీల్లో డబ్బులు దోచేసే దొంగల్ని మనం చాలామందని చూసి ఉంటా. కానీ ఈ దొంగ మాత్రం వెరైటీ.. అందరు దొంగలు రాత్రివేళల్లో ఆలయంలోకి చొరబడి హుండీ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడితే.. కానీ ఈ దొంగ మాత్రం స్టైల్ మార్చాడు. పట్టపగలు, అందులో మిట్ట మధ్యాహ్నం దర్జాగా హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోతున్నాడు. ఈ సీన్ మొత్తం ఆలయంలో సీసీ కెమెరాలో రికార్డైంది.


అమ్మవారి ఆలయంలోకి ఓ వ్యక్తి దర్జాగా అక్కడికి వచ్చాడు. అమ్మవారికి నమస్కరిస్తున్నట్లు నటించాడు.. కొద్దిసేపు అక్కడే అటూ ఇటు తిరిగాడు. కొద్దిసేపు అక్కడ మెట్లపై కూర్చున్నాడు.. ఎవరూ రావడం లేదని నిర్థారించుకున్న తర్వాత వెంటనే వచ్చిన పని ముగించుకుని వెళ్లాడు.. అయితే పక్కన సీసీ కెమెరాలో మొత్తం రికార్డైంది. కాకినాడలోని ఆలయంలో ఈ నెల 20న చోరీ జరగ్గా.. సీసీ ఫుటేజ్‌తో ఇప్పుడు బయటపడింది. పట్టపగలు, మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి.. దర్జాగా హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోయాడు. అరటిగెలను మూటకట్టినట్టు.. హుండీని గోనెసంచిలో మూటకట్టి అత్తారింటికి వెళ్తున్నట్టు వెళ్లాడు.

కాకినాడలోని సంజయ్ నగర్‌లో అమ్మవారి ఆలయం రోడ్డుకు ఆనుకుని ఉంది. ప్రతి రోజూ భక్తులు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో అమ్మవారి హుండీని ఎవరో ఎత్తుకెళ్లారు.. ఆలయ నిర్వాహకులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే చోరీ వ్యవహారం బయటపడింది. ఈ నెల 20న ఓ వ్యక్తి అమ్మవారి గుడి దగ్గరకు వచ్చాడు. బయట చక్కగా చెప్పులు వదిలేసి.. గుడిలోపలికి వెళ్లి అమ్మవారికి మొక్కాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి మెట్లపై కూర్చున్నాడు. మళ్లీ లోపలికి వచ్చాడు.. మళ్లీ బయటకు వెళ్లి కూర్చున్నాడు.

రెండు, మూడుసార్లు అలా చేసిన తర్వాత ఆ వ్యక్తి నేరుగా ఆలయంలోకి వెళ్లాడు. రోడ్డుపై వచ్చీపోయే వారిని బాగా గమనించాడు. రోడ్డు మీద పెద్దగా ఎవ్వరూ లేని సమయంలో గుడిలోపలికి వెళ్లి హుండీని ఒక గోనెసంచిలో మూటకట్టాడు. హుండీని భుజంపై పెట్టుకుని దర్జాగా బయటకు వచ్చాడు. ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.. ఇంత జరిగినా చుట్టూ ఎవరూ పట్టించుకోలేదు. దొంగ ఆలయంలోకి రావడం.. బయట కూర్చోవడం.. ఆ వెంటనే హుండీని ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. సీసీ ఫుటేజ్‌లో ఉన్న తేదీని బట్టి ఈ నెల 20న చోరీ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో జరిగింది. అర్చకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాకినాడ అమ్మవారి ఆలయంలో ఘటన

అమ్మవారంటే భయం కూడా లేదేమో
లోపలికి వచ్చాడు.. దర్జాగా ఎత్తుకెళ్లాడు






Also read

Related posts

Share via