November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తలుపుకు తాళం వేస్తే తప్పదు చోరీ.. రెండేళ్లుగా వీడని మిస్టరీకి పోలీసుల చరమగీతం..Watch Video

గత రెండు సంవత్సరాలుగా వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్‎గా మారిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేవలం జల్సా కోసమే ఈ దొంగతనాలు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి చోరికి గురైన రూ.24 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బైక్ ,అయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా అళ్ళగడ్డ సబ్ డివిజన్‎లో గల కోవెలకుంట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్ళలో ఎనిమిది ఇండ్లలో చోరి జరిగింది. దొంగలు ఎలాంటి క్లూ లేకుండా చోరీలకు పాల్పడటం పోలీసులకు సవాల్‎గా మారింది.

ఈ కేసు ఛాలెంజ్‎గా తీసుకున్న పోలీసులు ఎంతో శ్రమించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించారు. కోవెలకుంట్ల శివారులో వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అరెస్టు అయినవారంతా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులు కేవలం జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దొంగతనాలకు పాల్పడిన దుష్యంత్, ఇజిత్ కుమార్, బత్తుల విజయ్, ఉయ్యాలవాడ గుర్రప్ప, సంజామల శ్రీకాంత్ అంతా కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి చోరీలకు పాల్పడేవాళ్ళు. కేవలం కోవెలకుంట్లలోని ఇళ్లనే టార్గెట్ చేసేవాళ్లుగా తెలుస్తోంది. అందులోనూ తాళం వేసిన వాటిని గమనించి రాత్రి, పగలు అని తేడా లేకుండా పకడ్బందీగా చోరీకి పాల్పడేవాళ్లని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి వెల్లడించారు. కేసు చేదించడంలో ప్రతిభ కనబరిచిన కోవెలకుంట్ల సిఐ జయచంద్ర, ఎస్ఐ వరప్రసాద్, రాజ్ కుమార్‎లను జిల్లా ఎస్పీ రివార్డులు ఇచ్చి ప్రోత్సహించారు.

వీడియో..

Also read

Related posts

Share via