గతంలో ప్యాక్షన్ నడిచేటప్పుడు పల్నాడు పల్లెల్లో గంపల కొద్దీ నాటు బాంబులు దొరికేవి… అయితే ఇవి తయారు చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉండేవారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో నాటు బాంబుల తయారీకి పుల్ స్టాప్ పడింది. గత రెండు ఎన్నికల్లోనూ నాటు బాంబులు ఎక్కడా పేలలేదు.. కానీ…
2024 ఎన్నికల్లో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పల్నాడు ప్రాంతంలో అధికంగా ఘర్షణలు జరిగాయి. దీంతో గత మూడు రోజుల నుండి పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పల్నాడులో ఎప్పుడు లేనంతగా స్థానికులను కలవర పెడుతున్న అంశం పెట్రోల్ బాంబులు… గతంలో ప్యాక్షన్ నడిచేటప్పుడు పల్నాడు పల్లెల్లో గంపల కొద్దీ నాటు బాంబులు దొరికేవి… అయితే ఇవి తయారు చేయడానికి ప్రత్యేకంగా మనుషులు ఉండేవారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ తగ్గిపోవడంతో నాటు బాంబుల తయారీకి పుల్ స్టాప్ పడింది. గత రెండు ఎన్నికల్లోనూ నాటు బాంబులు ఎక్కడా పేలలేదు..
అటువంటి పరిస్థితే తిరిగి ఈ ఎన్నికల్లోనూ ఉంటుందని పల్నాడు వాసులు భావించారు. ఘర్షణలు చోటు చేసకుంటాయన్న ముందస్తు సమాచారం పోలీసులకు ఉన్నా బాంబులు మాత్రం ఉండవని అందరూ అనుకున్నారు. అయితే నాటు బాంబులు స్థానంలోనే పెట్రోల్ బాంబులు తెరపైకి రావడంతో అటు పోలీసులు ఇటు స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
దాచేపల్లి మండలం తంగెడలో పోలింగ్ ముగిసిన వెంటనే వైసిపి టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో పెట్రోల్ బాంబులు కూడా విసురుకున్నారు. దీంతో అనేక వాహనాలు కూడా తగలబడ్డాయి. అప్పడే పెట్రోల్ బాంబుల విధ్వంసం కూడా బయటపడింది. అయితే ఇక ఎక్కడా కూడా పెట్రోల్ బాంబులు ఉండవని అందరూ అనుకున్నారు.
ఎన్నికల ముగిసిన మూడు రోజుల తర్వాత పోలీసులు సమస్యాత్మకంగా గ్రామాల్లో విసృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాల్లో పెద్ద సంఖ్యలో పెట్రోల్ బాంబులు బయడపడటంతో స్థానికులు ఉలిక్కి పడుతున్నారు. మాచవరం మండలం పిన్నెల్లిలో పలువురు ఇళ్లలో ట్రేల్లో సర్ధి పెట్టుకున్న పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసకున్నారు.
ముప్పాళ్ల మండలం మాదలలో కూడా పెట్రోల్ బాంబులు బయట పడ్డాయి. ఓ ఇంట్లోని బాత్ రూంలో దాచి ఉంచిన 29 పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇంకా అనేక చోట్ల పెట్రోల్ బాంబులు ఉంటాయన్న చర్చ పల్నాడు పల్లెల్లో మొదలైంది. రానున్న రోజుల్లో అన్ని సమస్యాత్మక గ్రామాల్లో సోదాలు చేయాలన్న డిమాండ్స్ వినపడుతున్నాయి. పెట్రలో బాంబులు తయారు చేస్తున్నా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే