అమావాస్య రోజున అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి గుట్టుగా వచ్చాడు ప్రియుడు. తన చేతితో తీసుకొచ్చినవి చూసి అందరూ దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ ఏం తీసుకొచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
తిరుపతి జిల్లాలో ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు ఒక యువకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అమావాస్య రోజు ప్రియురాలిని తన వశం చేసుకునేందుకు వశీకరణ యంత్రంతో ప్రయత్నించి చావు దెబ్బలు తిన్నాడు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కాలన్న ఆశతో మాంత్రికుడిని కలిసి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. మాంత్రికుడు చెప్పినట్టే చేశాడు. ఇందులో భాగంగా పెనుమూరుకు చెందిన సురేష్.. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లికి చేరుకున్నాడు.
చంద్రగిరిలో ఇంటర్ చదివిన విద్యార్థిని కోసం కొంతకాలం వెంటపడిన సురేష్ వశీకరణ ప్రయత్నం చేశాడు. అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో మల్లయ్యపల్లికి చేరుకున్న సురేష్.. యువతి ఉండే ఇంటి గోడ దూకే ప్రయత్నం చేశాడు. ఎవరో గోడ దూకుతున్నట్టు గమనించిన ఇంట్లోని ముసలమ్మ కేకలు వేసింది. ఈలోపు అప్రమత్తమైన గ్రామస్తులు సురేష్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వెంటాడడంతో తిరగబడి రాళ్లు విసిరిన యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దొంగగా భావించి వెంటపడ్డ గ్రామస్తులు ముళ్లపొదల్లో దాక్కున్న సురేష్‌ను పట్టుకుని చావబాదారు. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.
దొంగగా భావించి ఆరా తీస్తే అసలు ఆ యువకుడు ఎందుకు గ్రామానికి వచ్చాడన్నది గ్రామస్తులకు అర్థమైంది. యువకుడి వద్ద ఉన్న కత్తి, తాయత్తులు, మంత్రించిన నల్లని పౌడర్ లభించడంతో గ్రామస్తులు మరింతగా రెచ్చిపోయారు. మహిళలు కూడా చావబాదారు. విషయాన్ని పోలీసులకు తెలిపిన గ్రామస్తులు సురేష్‌ను అప్పగించారు. గ్రామస్తుల చెంప దెబ్బలకు గాయపడ్డ సురేష్ దొంగ కాదని నిర్ధారించుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెనుమూరులో ఉన్న కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించారు
Also read
- Diwali 2025: దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శుభమా? అశుభమా? నియమాలు తెలుసుకోండి..
- Astro Tips: ఈ రాశుల వారు వెండి ధరించారో బతుకు బస్టాండే.. తస్మాత్ జాగ్రత్త
- నేటి జాతకములు…16 అక్టోబర్, 2025
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత