SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: అయ్యో చిట్టితల్లి.! అప్పుడే నూరేళ్లు నిండాయా.. ఎంత ఘోరం జరిగిపోయింది

 


పాపం.! చిట్టితల్లికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. ఒకరు చేసిన నిర్లక్ష్యానికి చాలారోజులు పోరాడి తన ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..? ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాచిపెంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న కీర్తన(17) అనే బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. కీర్తన గత నెల రోజులుగా రక్తహీనత, జ్వరం, పచ్చకామర్ల సమస్యలతో బాధపడుతుంది. అయితే ఆమె ఆరోగ్యం పరిస్థితిని కేజీబీవీ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో కీర్తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు గత నెల 23న స్కూల్ నుంచి తమ స్వగ్రామం మక్కువ మండలం నంద గ్రామానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో మెరుగైన వైద్యం ఇప్పించడానికి ఇబ్బంది పడ్డారు. చేసేదిలేక స్థానిక ఆసుపత్రుల్లోనే తమకున్న ఓపిక కొద్దీ చికిత్స అందించారు. సుమారు నెల రోజులు పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. కానీ ఎంత చికిత్స అందించినా ప్రయోజనం లేక పరిస్థితి మరింత విషమించి ప్రాణాలు కోల్పోయింది కీర్తన. బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తమ కూతురు ఆరోగ్యం గురించి కేజీబీవీ అధికారులు కనీసం అడిగి తెలుసుకోలేదని, కూలీ చేసి సంపాదించిన డబ్బుతోనే చికిత్స చేయించామని, ఎంత కష్టపడినా తమ కూతురు ప్రాణాలు కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. చదువులో బాగా రాణించాలని కలలు కన్న కీర్తన తల్లిదండ్రుల ఆశలు చిద్రమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద కుటుంబాల పిల్లల ఆరోగ్య సదుపాయాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టించాలని కోరుతున్నారు స్థానికులు. గిరిజన ప్రాంతంలో తరచూ ప్రభుత్వ హాస్టల్స్‌లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు రక్తహీనత బారిన పడి మృత్యువాత పడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ సిబ్బంది గాని ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ముందస్తుగా రక్త పరీక్షలు చేసి రక్తహీనత పరిస్థితి తెలుసుకొని మmజాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అధికారులు. అయితే ఆ పరిస్థితి ఇటీవల లోపించింది. దీంతో విద్యార్థులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఘటనలను సీరియస్ గా తీసుకొని రక్తహీనతతో మరణాలు లేకుండా చూడాలని కోరుతున్నారు జిల్లావాసులు

Also read

Related posts