April 6, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: అప్పటి వరకు కళ్లముందు కదలాడిన రెండేళ్ల కొడుకు.. నీటి సంపులో శవమై..!



అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఉన్నట్టుండి నీటి గండంతో మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు చూస్తున్నారు.


అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఉన్నట్టుండి నీటి గండంతో మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో రెండేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్డనగేరి గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే రాజబాబు, అతని భార్య లక్ష్మి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. వారిలో రెండేళ్ల వరుణ్ తేజ ఆఖరి సంతానం. నీరు అవసరమై తల్లి లక్ష్మీ ఇంటి ముందు ఉన్న నీటి సంపు తెరిచి నీళ్లు తోడుకుని సంపు మూత మూసి ఇంట్లోకి వెళ్లి పోయింది.

అయితే తొందర్లో సంపు మూత సరిగా మూసుకోకపోవడంతో అక్కడే ఆడుకుంటూ ఉన్న వరుణ్ తేజ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లి చుట్టుపక్కల వెతికింది. చివరికి నీటి సంపులో బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు నీటి సంపులో విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు చూస్తున్నారు.

Also read

Related posts

Share via