SGSTV NEWS
Andhra PradeshCrime

పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్‌గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే



శ్రీ సత్య సాయి జిల్లాలో వారం రోజులు క్రితం జరిగిన ఓ యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేదించారు. కర్ణాటక రాష్ట్రం గౌరీ బిదనూరుకు చెందిన పవన్ కుమార్ హిందూపురం మండలం సందేబిదనూరు గ్రామ శివారులో హత్యకు గురయ్యాడు. నిందితులు హత్య చేయడానికి గల కారణం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.


శ్రీ సత్య సాయి జిల్లాలో వారం రోజులు క్రితం జరిగిన ఓ యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేదించారు. కర్ణాటక రాష్ట్రం గౌరీ బిదనూరుకు చెందిన పవన్ కుమార్ హిందూపురం మండలం సందేబిదనూరు గ్రామ శివారులో హత్యకు గురయ్యాడు. ఓ వివాహ వేడుకకు హిందూపురం మండలం సందిబిదనూరుకు వచ్చిన పవన్ కుమార్ తిరిగి వెళుతూ ఒక దుకాణంలో కల్లు తాగాడు. ఫుల్లుగా కల్లు తాగి మద్యం మత్తులో ఉన్న పవన్ కుమార్‌ను గమనించిన ఇద్దరు మైనర్లు. పవన్ కుమార్ మెడలో ఉన్న వెండి గొలుసుపై కన్నేశారు. దీంతో ఇద్దరు మైనర్లు పవన్ కుమార్‌కు మరింత కల్లు తాగించి. ఆ పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు.

అనంతరం పవన్ కుమార్ మెడలో ఉన్న వెండి చైన్ తీసుకుని, డబ్బుల కోసం జేబులో చెక్ చేయగా పల్సర్ బైక్ తాళాలు కనిపించాయి. దీంతో అక్కడే ఉన్న పల్సర్ బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే పవన్ చనిపోయాడో? లేదో అని తెలసుకునేందుకు మరో ఇద్దరితో యువకులతో కలిసి హత్య చేసిన ప్రదేశానికి వచ్చారు మైనర్లు. మృతుడి ముఖం గుర్తు పట్టకుండా ఉండేందుకు.. మళ్లీ బీర్ బాటిల్తో ముఖంపై పొడిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.

అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్‌తో అక్కడ ఆధారాలు సేకరించారు. అయితే అప్పుడు కూడా ఆ ఇద్దరు మైనర్లు అక్కడే ఉన్నారు. పోలీసులు లోతైన దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తుండగా హత్య జరిగిన రోజు మృతుడు పవన్ కుమార్ తో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నట్లు కళ్ళు దుకాణంలో ఉన్నవారు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా… అసలు విషయం తెలిసింది.

చెడు వ్యసనాలకు, జల్సా లకు అలవాటుపడ్డ మైనర్లు.. కళ్ళు దుకాణానికి వచ్చే వారు తాగిన మత్తులో ఉన్నప్పుడు వారి దగ్గర డబ్బులు, సెల్ ఫోన్లు లాక్కునేవారని.. పోలీసులు విచారణలో తేలింది. వెయ్యి రూపాయలు వెండి చైన్ కోసం ఇద్దరు మైనర్ బాలురు.. పవన్ కుమార్‌ను హత్య చేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts