ఒకప్పుడు ఆ ప్రాంతంలో టెన్షన్ .. టెన్షన్.. మావోయిస్టులు, రాడికల్స్ ఎక్కువగా ప్రభావితం చేసే ప్రాంతం కావడంతో ఎప్పుడూ భయంగానే ఉండేది.. కాలక్రమేణా.. మావోయిస్టులు, రాడికల్స్ కనుమరుగైపోయారు. తాజాగా ఓ ఘటన పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. పచ్చని పంట పొలాల్లో రెండు నాటు తుపాకులు పోలీసులకు లభ్యమయ్యాయి.. అనంతపురం జిల్లా కనేకల్ మండలం సొల్లాపురం గ్రామ పరిధిలోని గాలిమరలు ఏర్పాటు చేసిన పంట పొలాల్లో రెండు నాటు తుపాకులను గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో నాటు తుపాకులు పడేసి వెళ్లిపోయినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.
దీంతో కనేకల్ పోలీసులు అక్కడికి చేరుకుని రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.. ఒకప్పుడు రాయదుర్గం, కనేకల్, ఉరవకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టులు… రాడికల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది. అలాంటి ప్రాంతంలో నాటు తుపాకులు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీసులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్వాధీనం చేసుకున్న రెండు నాటు తుపాకులలో ఒకటి ఇంకా పనిచేస్తూనే ఉందని పోలీసులు చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
అసలు ఈ నాటు తుపాకులు ఇక్కడికి ఎలా వచ్చాయి..? ఎవరైనా ఇటీవల ఇటువైపు వచ్చారా..? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకా ఎవరి దగ్గరైనా నాటు తుపాకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. లైసెన్స్ లేకుండా తుపాకులు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వీడియో చూడండి..
గతంలో నాటు తుపాకుల సంస్కృతి ఎక్కువగా ఉన్న అనంతపురం జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది.. అయితే.. అటు పోలీసుల ఒత్తిడి.. లైసెన్స్ లేనివాళ్లు ఇలా నాటు తుపాకులను వినియోగిస్తున్నారని.. అయినా.. ఇప్పుడు అది కూడా తగ్గిందని.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు..
నాటు తుపాకుల కలకలంతో అలెర్ట్ అయిన పోలీసులు… గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మావోయిస్టులు… రాడికల్స్ ప్రభావం ఉన్న గ్రామాలలో ఇంకా నాటు తుపాకుల సంస్కృతి కొనసాగుతుందా? లేదా..? అసలు తుపాకులు ఎవరివి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్క్రీమ్తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా