SGSTV NEWS
Andhra PradeshCrimeViral

Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో



తునిలో బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు నారాయణరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. వాష్‌రూమ్ కోసం కారు ఆపి చెరువులో దూకినట్లు పోలీసులు చెబుతుండగా, కుమారుడు సురేష్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్పందన ఫేస్‌బుక్‌లో ఒకలా ఉండగా.. బయట మీడియాతో మరోలా ఉంది…


ఆంధ్రాలో సంచలనం రేపిన తుని మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య ప్రజంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు సోషల్ మీడియాలో ఒకలా.. బయట మరోలా స్పందించడం సంచలనం రేపుతోంది. నారాయణరావు కుమారుడు సురేష్ గురువారం ఉదయం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. ‘నా దృష్టిలో ఎప్పుడో పోయాడు’ అంటూ తండ్రి ఫోటోతో సంతాపం తెలుపుతున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టారు. తప్పు చేసిన తండ్రి పోతే మీరు స్పందించిన విధానం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే కొద్దిసేపటికే నారాయణరావు ఆత్మహత్య చేసుకున్న స్పాట్‌కు సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.



రాత్రి నిందితుడి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉండగా ఆత్మహత్య ఎలా చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు.. తమకు చెప్పిన సమయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి చనిపోతే వెంటనే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి ఆత్మహత్య చేసుకోలేదని.. పోలీసులే ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశాడు నారాయణరావు కుమారుడు సురేష్. సీసీ ఫుటేజీ విజువల్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశాడు




తునిలో బాలికపై నారాయణరావు అత్యాచారయత్నం బుధవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే అతడిపై స్థానికుల దాడి, పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కేసు నమోదు చేసి కోర్ట్‌కు తీసుకెళ్తుండగా నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా.. కోమటి చెరువు దగ్గర వాష్ రూమ్ అని చెప్పి వెళ్లిన నారాయణరావు.. చెరువులో దూకాడని అంటున్నారు. రాత్రంతా వెతికినా దొరకకపోవడంతో.. గజ ఈతగాళ్లతో వెతికించి నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు.

ఇదే సమయంలో తుని కోమటి చెరువు దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. నారాయణరావు మృతిపై అనుమానాలున్నాయని అంబులెన్స్‌ను అడ్డుకున్నారు కుటుంబసభ్యులు. కాగా నారాయణరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అతనికి ఇద్దరు భార్యలు అని సమాచారం. ‌డెడ్‌బాడీని తీసుకెళ్లడానికి ఇప్పటివరకు ఎవరూ రాకపోవడంతో.. మార్చరీలో ఉంచారు పోలీసులు.

Also read

Related posts