March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

TTD: శ్రీవారి పరకామణిలో అవకతవకలు.. దారి మళ్లిన విదేశీ కరెన్సీ.. టీటీడీ ఉద్యోగిపై వేటు..!



చెన్నైలోని టీటీడీ ఆధ్యర్యంలోని శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం ప్రదర్శించినట్లు నిర్ధారించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించినట్లు తేల్చారు. సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించింది. ఈ మేరకు కృష్ణకుమార్‌ను టీటీడీ ఈవో శ్యామలరావు సస్పెండ్‌ చేశారు.


కళియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఏడు కొండలపై వెలసిన శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శించుకుంటారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయాలను నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ తిరుమల చేరుకోలేని భక్తులు ఈ ఆలయాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటూ పెద్ద ఎత్తున హుండీలలో కానుకలు, విరాళాలు సమర్పించుకుంటారు. దీంతో నిత్యం కోట్ల రూపాయలు శ్రీవారి హుండికి ఆదాయంగా చేకూరుతుంది. అయితే తాజాగా శ్రీవారి ఆలయ పరకామణి హుండీ లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు.


తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం ప్రదర్శించినట్లు తిరుమల విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించినట్లు నిర్ధారించారు. తాజాగా చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గడచిన సంవత్సరంలో హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీ టీటీడీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వింగ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో హుండీలో వచ్చిన 6 లక్షల విదేశీ కరెన్సీ కృష్ణకుమార్ దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో కృష్ణకుమార్‌‌పై కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. ఆరోపణలు రుజువు కావడంతో కృష్ణకుమార్‌ను సస్పెండ్ చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు

Also read

Related posts

Share via