SGSTV NEWS
Andhra PradeshCrime

స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. ఫ్రెండ్స్‌తో కలిసి నదిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి!



శ్రీకాకుళం జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం నెలకొంది. నదిలో స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు వెళ్లిన ఒక యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుల సమాచారంతో ఘటనా స్థానికి చేరుకున్న స్థానికులు యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటిదాకా తమతో సరదాగా గడిపిన స్నేహితుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అతని ఫ్రెండ్స్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు.


శ్రీకాకుళం జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజు విషాదం నెలకొంది. సరదాగా స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు నదికి వెల్లిన ఒక యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్నేహితుల దినోత్సవం రోజే తమ స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడంతో సదరు యువకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. బూర్జ మండలం లాబాం గ్రామ సమీపంలో ఆరుగురు స్నేహితులు నాగవళి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఇక స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అయితే కాసేపు స్నానం చేసిన తర్వాత ఐదుగురు స్నేహితులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దుర్గాప్రసాద్ (19) అనే యువకుడు మాత్రం నీటి లోతు ఎక్కవగా ఉన్న ప్రాంతానికి వెల్లి చిక్కుకుపోయాడు.


స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో ఫ్రెండ్స్‌ స్థానికులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు దుర్గాప్రసాద్ కోసం నదిలో తీవ్రంగా గాలించారు. చాలా సేపటి తర్వాత దుర్గా ప్రసాద్‌ ఆచూకీని కనిపెట్టారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారంతో ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి.. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని శ్రీకాకుళం GGHకు తరలించారు. మృతి చెందిన దుర్గాప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని బల్లంకి వీధికు చెందిన యువకుడుగా పోలీసులు గుర్తించారు. మృతుడు పాలకొండలోని తమ్మినాయుడు కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. దుర్గాప్రసాద్ మృతితో పాలకొండ లోను విషాదచాయలు అలుముకున్నాయి

Also read

Related posts

Share this