SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: ఛీ.. మరీ ఇంత దారుణమా.. బిడ్డకు జన్మనిచ్చి.. ఇసుకలో పాతిపెట్టిన యువతి



రోజురోజుమూ మనుషుల్లో మానవత్వం మంటకలిసిపోతుంది. రక్తసంబంధాలకు విలువ లేకుండా పోతుంది. కొందరు కన్న తల్లిదండ్రులను, తొడబుట్టిన అక్కా, చెల్లెళ్లు, అన్నా దమ్ముళ్లను హతమార్చుతంటే.. మరికొందరు కన్న బిడ్డలను కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో వెలుగు చూసింది. అప్పుడే ప్రాణం పోసుకొని బయటకొచ్చిన ఒక పసికందును ఆమె కన్నతల్లే ఇసుకలో పాలిపెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది.


రోజురోజుమూ మనుషుల్లో మానవత్వం మంటకలిసిపోతుంది. రక్తసంబంధాలకు విలువ లేకుండా పోతుంది. కొందరు కన్న తల్లిదండ్రులను, తొడబుట్టిన అక్కా, చెల్లెళ్లు, అన్నా దమ్ముళ్లను హతమార్చుతంటే.. మరికొందరు కన్న బిడ్డలను కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో వెలుగు చూసింది. కన్నబిడ్డలకు కష్టం రాకుండా చూసుకోవాల్సి ఒక తల్లి అప్పుడే పుట్టిన తన ముక్కుపచ్చలారని శిశువును బస్టాండ్‌ సమీపంలోని ఒక దుకాణం వద్ద ఇసుకలో పాతిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరుసటి రోజు ఉదయం పరిసరాలు శుభ్రచేస్తుండగా ఇసుకలో శిశువును గుర్తించిన పారిశుధ్య కార్మికులు స్థానికుల సహాయంలో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బిడ్డను పరీక్షించిన వైద్యలులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరో గుర్తుతెలియని యువతి ఆదివారం రాత్రి బిడ్డకు జన్మనిచ్చి.. శిశువును ఇక్కడే ఇసుకలో పాతి పెట్టి వెళ్లి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా శిశువు తల్లి ఆచూకీ కోసం గాలిస్తున్నారు

Also read

Related posts