సాధారణంగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు లక్షల జీతం, ఏసీ కారు, టీఏ, డీఏలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నత ఉద్యోగులకు ఇదే రకమైన వేతనాలు ఉంటాయి. మనం కలలో కూడా ఊహించని వీరికి లక్షల్లో వేతనాలు ఉన్నాయి. వీరు ఎవరో..? వీరు ఏం డ్యూటీ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం నేటి యువత అడ్డదారులు తొక్కుతున్నారు. తమకున్న నైపుణ్యాన్ని వినియోగించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన పసుపులేటి రాజు.. సాఫ్ట్‌వేర్ నైపుణ్యం కలిగిన కొంతమందికి చేరదీసి డబ్బు ఆశ చూపి ముఠా ఏర్పాటు చేశారు. వీరికి నెలకు లక్షల్లో వేతనం, ఏసీ కారు, టీఏ, డీఏలు ఇస్తుంటాడు. మీరు చేయాల్సింది దొంగతనాలు మాత్రమే. ఈ దొంగలు తమ టాలెంట్ ఉపయోగించి సెల్ ఫోన్లు కొట్టేయడమే పని. రద్దీ ప్రదేశాల్లో అమాయకులను టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లను చాకచక్యంగా కొట్టేస్తారు. ఫోన్ నెంబర్లకు లింక్ చేసిన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో కోట్టేస్తున్నారు కేటుగాళ్ళు.
ప్రతి ప్రదేశంలోనూ జనాలను ఏమార్చి ఫోన్ కొట్టేసిన వెంటనే వారు వచ్చిన కారులో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తారు. ఆ వెంటనే గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ యాప్‌లు ఓపెన్ చేసి ఫర్‌గెట్ పాస్‌వర్డ్ ఆప్షన్‌తో మీ పిన్ మార్చేసి ఓటీపీ ద్వారా కొత్త పిన్ జనరేట్ చేస్తారు. కొత్త ఓటీపీతో ఖాతాల్లోని డబ్బుని కాజేస్తున్నారు. ఇదే తరహాలో సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన పెద్దగట్టు జాతరలో దృష్టి మరల్చి సెల్‌ఫోన్లు కొట్టేసి ఐదు ఖాతాల నుంచి సుమారు 4.5 లక్షల రూపాయలు దోచేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ కర్నూల్‌కి చెందిన పసుపులేటి రాజు ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో దొంగతనం కోసం వెళ్తున్న ఈ ముఠాను చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీ కాగా.. ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. తమకు లక్షల్లో వేతనాలు, ఇతర అలవెన్సులు ఇస్తున్నారని, తాము సెల్ ఫోన్లను దొంగిలించడమే పని అని పోలీసులకు చెప్పారు. నిందితుల నుండి 3.5 లక్షల నగదు, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజు కోసం ప్రత్యేక టీములతో గాలిస్తున్నట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ వెల్లడించారు.
సెల్ ఫోన్ వినియోగించి యూపీఏ , బ్యాంకు లావాదేవీలు నడిపేవారు జర జాగ్రత్త ఏ కారణం చేతనైనా ఫోన్ పోయిందా వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ , సిమ్ కార్డు , బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయండి . దీని కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంచార్ సాతి యాప్‌ని వినియోగించండి లేదంటే మీ ఫోన్లు కేటుగాళ్ళకు చేతుల్లోకి వెళ్తే ఖాతాల్లోని డబ్బులు గోవిందే.. సో మీ ఫోన్లు జర భద్రం..
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!