SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: ఎవడ్రా నువ్వు.! గుడిలో గుట్టుగా ఆ యాపారం.. దేవుడ్ని మొక్కాల్సిందిపోయి..



అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. ఈ ముదురు మాత్రం కాస్త తేడా.. గుడికి ఎందుకు వెళ్ళాడో తెలిస్తే.. దెబ్బకు షాక్ అవుతారు. ఆ విజువల్స్ ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ లో వైరల్ అవుతున్నాయి. అదేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

సాధారణంగా జనాలు గుడికి ఎందుకు వెళ్తారు.? ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా.. తమ మొక్కులు తీర్చుకునేందుకు, కోరికున్నవి జరిగేందుకు దేవుడ్ని మొక్కేందుకు వెళ్తుంటారు జనాలు. కానీ ఇక్కడొక కేటుగాడు దొంగలించడానికే గుడికి వెళ్తాడు. దొంగ అంటే కచ్చితంగా కరుడుకట్టిన నేరస్తుడు అనేలా ఉంటాడు ఈ ప్రబుద్దుడు. ఇక అతడు చేసిన పని అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది.



వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీలో డబ్బులు కాజేస్తూ అడ్డంగా దొరికాడు ఓ దొంగ. వైర్‌కు బబుల్‌గమ్ అంటించి హుండీలోని డబ్బులు లాగేశాడు. పలుసార్లు హుండీలోని డబ్బులు కాజేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు. అనుమానంతో ఆలయ నిర్వాహకులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. అసలు గుట్టంతా బయటపడింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts