SGSTV NEWS
Andhra PradeshCrime

నలుగురు యువకులతో కలిసి స్కెచ్.. చివరకు..



తెనాలిలోని సీఎం కాలనీలో మణికంఠ నివసిస్తున్నాడు. పౌరహిత్యం చేస్తుంటాడు. 18వ తేది రాత్రి సమయంలో మణికంఠ ఇంటి ఎదుట ఒక కారు ఆగింది. కారులో నుండి ఒక మహిళ, నలుగురు యువకులు దిగారు. వెంటనే ఇంటిలోకి వెళ్లి మణికంఠను పట్టుకొని కారు దగ్గరకు లాక్కొచ్చారు. అనంతరం కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లిపోయారు..

తెనాలిలోని సీఎం కాలనీలో మణికంఠ నివసిస్తున్నాడు. పౌరహిత్యం చేస్తుంటాడు. 18వ తేది రాత్రి సమయంలో మణికంఠ ఇంటి ఎదుట ఒక కారు ఆగింది. కారులో నుండి ఒక మహిళ, నలుగురు యువకులు దిగారు. వెంటనే ఇంటిలోకి వెళ్లి మణికంఠను పట్టుకొని కారు దగ్గరకు లాక్కొచ్చారు. అనంతరం కారులో బలవంతంగా ఎక్కించుకొని వెళ్లిపోయారు.. ఈ ఘటనను చూసిన పక్కింటి యువకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన 3 టౌన్ పోలీసులు వెంటనే కారును ఏ మార్గంలో వెళ్లిందో సాంకేతిక ఆధారాలతో సమాచారం రాబట్టారు. యువకుడిని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కారు చేబ్రోలు మండలం శేకూరు వైపు వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆ మార్గంలోకి వెళ్లి కారు ట్రేస్ చేసి పట్టుకున్నారు. అప్పటికే మణికంఠపై నలుగురు యువకులు దాడి చేశారు. వెంటనే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మహిళతో సహా వారిని పిఎస్ కు తీసుకెళ్లారు. పోలీసులు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. మణికంఠ అత్త విజయలక్ష్మి కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. అల్లుడిని చంపేందుకు సైతం సిద్దమైనట్లు తెలియడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో విజయలక్ష్మీ మరిన్ని విషయాలు వెల్లడించింది.

రెండేళ్ల క్రితం మణికంఠ, విజయలక్ష్మీ కుమార్తె లిఖిత వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే ఆ తర్వాత అత్తతో విభేదాలు వచ్చాయి. అప్పటి నుండి మణికంఠ అత్త దగ్గరకు తన భార్యను పంపించేందుకు ససేమిరా అన్నాడు. దీంతో విజయలక్ష్మీ అల్లుడిపై కోపం పెంచుకుంది. తన కుమార్తెను తన వద్దకు పంపించకపోవడంతో ఎలాగైనా కుమార్తెను తన ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన వారితో మాట్లాడి అల్లుడిని కిడ్నాప్ లేదా చంపైనా సరే కుమార్తెను తీసుకెళ్లాలని అనుకుంది. ఇందులో భాగంగానే అల్లుడును కిడ్నాప్ ప్లాన్ చేసింది. అయితే చివరి నిమిషంలో కిడ్నాప్ బెడిసి కొట్టి పోలీసుల చేతికి చిక్కారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు

Also read

Related posts