SGSTV NEWS
Andhra PradeshCrime

Srisailam: ఏకంగా 12సార్లు హుండీ సొమ్ము కాజేసిన ఉద్యోగి.. శ్రీశైలం చోరీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..



దేవుడి సొమ్మే కాజేశాడు ఓ నీచుడు. ఈ ఘటన శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో జరిగింది. అరగంట ముందే హారతికి సంబంధించిన పనులు చూడాలంటూ పరిచారక్ గర్భాలయంలోకి వెళ్లేవాడు. ఆ సమయంలో క్లాత్ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగలించేవాడని విచారణలో తేలింది. అతడు సుమారు 12 సార్లు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో పూజలు చేసే పరిచారకుడు దొంగగా అవతారమెత్తాడు. విలాసవంతమైన జీవితం గడపడం కోసం దొంగగా మారిన వైనం వెలుగు చూసింది. గర్భాలయంలోని హుండీలో డబ్బు దొంగతనం చేసిన కాంట్రాక్ట్ బేసిక్ పరిచారకుడు విద్యాధరను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో పరిచారకుడిగా విధులు నిర్వహిస్తున్న విద్యాధర్ గర్భాలయంలోని హుండీలో కొంత డబ్బు దొంగలు ఇచ్చారని దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

విద్యాధర్ గత రెండేళ్ల నుండి మల్లికార్జున స్వామి ఆలయంలో పరిచారకుడిగా పనిచేస్తున్నాడని సీఐ ప్రసాదరావు తెలిపారు. గత 18 నెలల నుండి డ్యూటీ సమయం కంటే అరగంట ముందే హారతికి సంబంధించిన పనులు చూడాలంటూ గర్భాలయంలోకి వెళ్లేవాడని తెలిపారు. ఆ సమయంలో క్లాత్ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగలించేవాడని విచారణలో తేలినట్లు తెలిపారు. పరిచారకుడు విద్యాధర సుమారు 12 సార్లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు. గర్భాలయం క్లాత్ హుండీలో దొంగలించిన రూ.1,24,200 నగదుతో పాటు కొనుగోలు చేసిన బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.

Also read

Related posts

Share this